రంగారెడ్డి

అడవుల శాతం పెరిగితేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 27: అడవుల శాతం పెరిగినప్పడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారం కార్యాక్రమంలో భాగంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియోషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటవల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఐదేళ్లలో 230కోట్లుమొక్కలు నాటాలని లక్ష్యాంగా పెట్టుకునామని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమంలా హరితహారాన్ని నిర్వహిస్తూన్నారని రామయ్య తెలిపారు. ఈ ఏడాది 46కోట్లు మొక్కలు నాటాలని అనుకుని, ఇప్పటి వరకు 8కోట్ల20లక్షాలు నాటమని చెప్పారు. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యమంలా పాల్గొంటున్నారని రామన్న పేర్కొనారు. దేవాదయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి తమవంతు కృషి అందిస్తామని తెలిపారు. గతంలోప్రైవేట్ వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాంట్రాక్టులు రద్దు చేసామని గుర్తుచేశారు. 270 ఎకరాలను అటవీశాఖ స్వాధీనం చేసుకుందని అన్నారు. మేయర్ బొంతు రామ్మెహన్ మాట్లాడుతూ బొటానికల్ గార్డెన్‌కు పూర్వవైభం తీసుకొస్తామని అన్నారు. గార్డెన్‌లో ఔషద మొక్కలు పెంచుతామని తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి, ఆటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా మొక్కలు నాటాలి
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్రర్ యాదవ్ పిలుపు నిచ్చారు. మసీదుబండలోని ఫార్చూన్ కుంకుమ్ హైట్స్ కాలనీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. రాబోవు తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిచాలంటే మొక్క నాటి పరిరక్షంచాల్సి భాద్యత అందరిపైన ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు ముందుకు వచ్చినప్పడే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్ నాయకులు రాజమల్లయ్య యాదవ్, రక్తపు దశరత్ గౌడ్, శ్రీనువాస్ లింగం గౌడ్, శ్రీనువాస్ ముదిరాజ్, అసోసియేషన్ సభ్యులు కార్తిక్‌రెడ్డి, బబార్‌సింగ్, విజయ్‌గౌడ్ పాల్గొన్నారు.
రామయ్యగూడలో..
వికారాబాద్: తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.శుభప్రద్‌పటేల్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అనసూయ, టిఆర్‌ఎస్ నాయకులు అశోక్, పాండు, సత్యం, యాదయ్య, చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
హరితహారం అందరి బాధ్యత
అల్వాల్: హరితహాహరం కార్యక్రమం అందరి బాధ్యత అని కలెక్టర్ రఘునందన్ రావు చెప్పారు. ఆదివారం ఓల్డు బోయిన్‌పల్లిలోని స్వర్గ్ధామ్ కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చెయ్యాలని, రోజురోజుకు అడవులు తగ్గిపోయి వాతావరణంలో సమతూల్యం దెబ్బతిని అనేకరకాల ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అధిగమించాలంటే ప్రతి వ్యక్తి బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు చెప్పారు. ప్రతి ఇంటిలో మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు, నాయకులు ప్రజలు పెద్దఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. కార్పొరెటర్ ముద్దం నర్సింహ్మా యాదవ్ తోపాటు కాలనీ అధ్యక్షుడు రఘునందన్ రావు, కార్యదర్శి రామలింగారెడ్డి, నాయకులు అమరేందర్ రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.
వెంకటాపురం డివిజన్‌లో..
అల్వాల్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో కార్పొరేటర్ సబిత మొక్కలు నాటారు. గ్రేటర్ కోఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కల జ్యోతి, నాయకులు అనిల్ కిషోర్, శ్రీనివాస్ గౌడ్, అల్వాల్ డిప్యూటీ కమిషనరు రమేష్, ఏఇ మహేష్ తోపాటు కాలనీ అధ్యక్షుడు విశ్వనాథం, కార్యదర్శి సుజాత రెడ్డి, నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు
ఆంజపూర్ డివిజన్‌లో..
చాదర్‌ఘాట్: హరితహారంలో భాగంగా అజంపూర్ డివిజన్‌లో టిఆర్‌ఎస్ నగర ప్రధాన కార్యదర్శి ఆజాం అలీ పలువురు పార్టీ కార్యకర్తలతో కలిసి మొక్కలను నాటారు. ఎన్ని మొక్కలను నాటామని కాదని, వాటిని బ్రతికించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మానవ మనుగడ ప్రశాంతంగా సాగాలంటే మొక్కలను పెంచాలని పిలుపునిచ్చారు.
ఘట్‌కేసర్ మండల పరిధిలోని
ఘట్‌కేసర్: వృక్ష సంపదను పెంచుకుని కరవులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా నిరంతరం పని చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఎన్‌ఎఫ్‌సినగర్, ఏదులాబాద్, అంకుషాపూర్, అవుషాపూర్ గ్రామాలలో ఆదివారం జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్రంలో చెట్లను నరకటం వల్ల అడవులు అంతరించి పోయినట్టు తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటకపోవటం వల్లనే వర్షాలు లేకపోవడంతో కరవు పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెండు మొక్కలు నాటి సహకరించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఆయా శాఖల కార్యాలయాలు గ్రామాల పరిసరాల ప్రాంతాలలో మొక్కలను నాటాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతిగ్రామంలో 40వేల మొక్కలను నాటాలని అన్నారు. ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, సర్పంచ్‌లు స్టీవెన్, మూసి శంకర్, బద్దం అర్చన, పెద్దొళ్ల రమేశ్, ఎంపిటిసి సభ్యులు జంపాల రమేశ్, కందుల కుమార్, కరుణాకర్, రాష్ట్ర విత్తన దృవీకరణ అప్పిలేట్ అథారిటీ సభ్యుడు రేసు లక్ష్మారెడ్డి, సహకారం సంఘం డైరక్టర్లు బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, ఉప సర్పంచ్‌లు యంపాల సుధాకర్‌రెడ్డి, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, నాయకులు చందుపట్ల వెంకట్‌రెడ్డి, వీరారెడ్డి, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
భావి తరాలకు మార్గదర్శకులు కావాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావి తరాలకు మార్గదర్శకులు కావాలని పోచారం సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ అన్నారు. ఘట్‌కేసర్ మండలం పోచారం పంచాయతీ ఎల్‌ఐజి కాలనీలో ఆదివారం జరిగిన హరితహారం కార్యక్రమంలో సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ, ఉప సర్పంచ్ ఆకిటి బాల్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తప్పనిసరి అని, నాటిన మొక్కలను పెంచేందుకు బాధ్యతగా గుర్తించాలన్నారు, ఎల్‌ఐజి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్‌కుమార్ మాట్లాడుతూ ఎల్‌ఐజి కాలనీ ఆవరణలోని ఖాళీస్థలంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటుతామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల్‌రెడ్డి అసోసియేషన్ కార్యదర్శి కాశినాధ్, కోశాధికారి బొడ్డు వెంకన్న, నాయకులు కృష్ణప్రసాద్, కుమార్ పాల్గొన్నారు.
సౌభాగ్యపురం పార్కులో..
ఎల్‌బినగర్: పర్యావరణ పరిరక్షణలో మొక్కలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలని సినీ నటి మంచులక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ఆర్కెపురం డివిజన్ సౌభాగ్యపురం పార్కులో తెరాస నాయకురాలు అనితారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. జీవరాసులు నీరు, ఆహారం లేకున్నా బతకలగరని కానీ ఊపిరి పీల్చుకోకపోతే బతకలేరని అన్నారు. నేడు మనం నాటిన మొక్కలు భవిషత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. మొక్కల పెంపకంపై మరింత ప్రచారం జరగాలని చెప్పారు. కార్పొరేటర్లు స్వప్న సుందర్‌రెడ్డి, సునరితారెడ్డి, సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, పి. అనితారెడ్డి, నాయకులు అంకిరెడ్డి, దయాకర్‌రెడ్డి, కంచర్ల శేఖర్ పాల్గొన్నారు.
లింగోజిగూడలో..
హయత్‌నగర్: పెరిగి పోతున్న కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు మూలా ఆధారమని ఎల్బీనగర్ తెరాస ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్, లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం డివిజన్ పరిధిలోని శ్రీసాయినగర్, జనప్రియ కాలనీ, బృందావన్, జ్యోతిక్లబ్ ప్రాంతాలలో కాలనీవాసులతో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డివిజన్‌లో అధికంగా మొక్కలు నాటి పచ్చని డివిజన్‌గా పేరు తెచ్చుకోవాలని అన్నారు.
మొక్కల కోసం ట్రీగార్డ్స్‌ను త్వరలో అందజేస్తామని చెప్పారు. డివిజన్‌లో నెలకొన్న ముంపు సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఎగువనున్న కాలనీల నుండి డ్రైనేజీ నీరు రాకుండ రూ.1.80కోట్లతో ట్రంక్‌లైన్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దీంతో కాలనీలలో ముంపు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీ్ధర్‌గౌడ్, కోటగిరి శ్రీనివాస్‌గౌడ్, ప్రేమ్‌నాథ్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, పార్శపు శ్రీ్ధర్, మహిళలు సరళ, పార్వతి, నీలకంఠం, ధన్‌పాల్, బీంరావు, ఇంద్రజీ పాల్గొన్నారు.
సౌజన్యానగర్ కాలనీలో
వనస్థలిపురం: ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం డివిజన్ పరిదిలోని సౌజన్యా నగర్ కాలనీలో కాలనీ వాసులతో కలసి మెక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగోలు డివిజన్ కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్.. రాక్‌హిల్స్ కాలనీలో కాలనీ వాసులతో కలసి మెక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు దోసపాటి రాము పాల్గొన్నారు.
మెక్కలు నాటిన బచ్‌పన్ విద్యార్థులు
వనస్థలిపురం హిల్ కాలనీలోని బచ్‌పన్ పాఠశాల విద్యార్దులు పాఠశాల ఆవరణంలో మెక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మెక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో బచ్‌పన్ ఎకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ రీజినల్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ రేణుక, కౌన్సిలర్ సుధ, ఉపాధ్యాయులు భారతి, శ్రీవాణి, ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.