రంగారెడ్డి

నేటి హరితహారం రేపటి పౌరులకు పచ్చని తోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 17: హరిత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. ఆదివారం బాచుపల్లి గ్రామం రేణుక ఎల్లమ్మ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కెపి వివేక్ సర్పంచ్ ఆగం పాండుతో కలిసి మొక్కలను నాటారు. ముందుగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని బృందావన్ కాలనీలో చిన్నారులతో కలిసి వివేక్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోందని అన్నారు. కనీవినీ ఎరుగుని రీతిలో హరిత హారం కార్యక్రమం జోరుగా సాగుతోందని చెప్పారు. మొక్కలను నాటడంతోనే పనైపోతుందని భావించవద్దని మొక్కలను నాటిన అనంతరం బాధ్యతతో వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి సన్న కవిత, వైఎస్ ఎంపిపి కృష్ణారెడ్డి, ఎంపిడిఓ అరుణ, ఇవోఆర్‌డి జ్యోతి, ఉపసర్పంచ్ సయ్యద్ సలీమ్, కాలనీ గౌరవాధ్యక్షుడు ఆగం రాజు, వార్డు సభ్యులు మహెందర్, వెంకటేశ్, దివాకర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు నరోత్తమరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరేందర్, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రగతినగర్ గ్రామంలో..
ప్రగతినగర్ గ్రామం, మిథులానగర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేక్ పాల్గొని కెపిహెచ్‌బి సిఐ కుషాల్కర్‌తో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపిపి కవిత, వైస్‌ఎంపిపి కృష్ణారెడ్డి, సర్పంచ్ ఆగం పాండు, నాయకులు సురేశ్, రామునాయక్ పాల్గొన్నారు.
వెంకట్రామిరెడ్డినగర్‌లో...
రంగారెడ్డినగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డినగర్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మొక్కలను స్థానిక కార్పొరేటర్ విజయశేఖర్‌గౌడ్, తెరాస నేత కెఎం ప్రతాప్ అందజేశారు. అనంతరం వారు మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, నాయకులు దుర్గయ్య, కనకరాజు, రాజిరెడ్డి, ఇక్బాల్, నారాయణ, చంద్రయ్య పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మంచాల: గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో స్థానిక వినోబానగర్‌లోని మాతాపితరుల సేవాసదనంలో ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర నేత మామిండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌నాయక్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మొక్కల పెంపకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి హరికిషన్, అరవింద్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సర్వేశ్వర్‌రెడ్డి, శశిధరాచారి, అలోక్‌కుమార్, భాస్కరాచారి, అజయ్, మాతాపితరుల సేవాసదనం అధ్యక్షుడు డాక్టర్ రాంరెడ్డి, ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, రాంచంద్రారెడ్డి, కొల్ల భాస్కర్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన విద్యార్థులు
ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని సీతారాంపేట గ్రామ సమీపంలో ఉన్న హెచ్‌ఆర్‌డి హైస్కూల్‌లో విద్యార్థులు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణ నిమిత్తం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మనోహర్‌రెడ్డి, డైరెక్టర్ అనురాధరెడ్డి, కార్యదర్శి గౌతమ్‌రావు, కరస్పాండెంట్ కెకెవి శర్మ, ప్రిన్సిపాల్ మాధురి మాట్లాడుతూ మొక్కల వల్ల కలిగే లాభాలను విద్యార్థులు తెలియజెప్పాలని అన్నారు. పర్యావరణంలో నెలకొన్న అసమతుల్యతలను తొలగించేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుకన్య, కవిత, ప్రియాంక, ప్రీతిక, రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు.
కెపిహెచ్‌బి 3వ ఫేజ్‌లో హరితహారం
కెపిహెచ్‌బికాలనీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం కెపిహెచ్‌బికాలనీ 3వ ఫేజ్‌లో మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీవీర బ్రహ్మం దేవాలయంలో జరిగిన కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, బాలాజీనగర్ కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కావ్యారెడ్డి మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాలలో, ఇళ్లు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో మొక్కలను పెంచడం ద్వారా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హరిత హారంలో పాల్గొని మొక్కల నాటాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులు బుచ్చయ్య, నర్సింహ్మ, పాండురంగనాధ్, ప్రభాకర్, బ్రహ్మానందం, లింగయ్య, తులసిరెడ్డి, మూర్తి, మహబూబ్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని కెపిహెచ్‌బికాలనీ డివిజన్ కార్పోరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. ఆదివారం కెపిహెచ్‌బికాలనీ 6వ ఫేజ్‌లో ఫామ్‌గ్రూ అపార్ట్‌మెంట్ సభ్యులు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలను నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అపార్ట్‌మెంట్ వాసులు సైతం హరితహారంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాగుప్రసాద్, రేఖ, భారతి, నారాయణరాజు, విజయ్‌కుమార్, కోటేశ్వర్‌రావు, రాజు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో జోరుగా హరితహారం
మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం మేడ్చల్‌లో జోరుగా సాగుతోంది. ఆదివారం హరితహారంలో భాగంగా పట్టణంలోని సాయినగర్ కాలనీలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జడ్పీటిసి శైలజ కాలనీవాసులతో కలిసి పరిసరాల్లో విరివిగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మానవాళి మనుగడ పచ్చదనంతోనే సాధ్యమని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని కంటికి రెప్పలా కాపాడాలని, నిత్యం నీరుపోయాలని సూచించారు. పచ్చదనం పరిఢవిల్లితేనే వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, వర్షాలు సమృద్ధిగా కురిసి కరవు కాటకాలు కూడా దూరమవుతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాలనీవాసులు రమేశ్, మల్లేశ్, బాబు, శోభ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ కార్యక్రమంలోని పాల్గొని విరివిగా మొక్కలు నాటారు. డబిల్‌పూర్ గ్రామంలో సర్పంచ్ రాజమల్లారెడ్డి ఇంటింటికీ తిరుగుతూ హరితహారంపై ప్రజలకు అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ మొక్కలను అందజేసి వాటిని సంరక్షించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిందే: తలసాని
నార్సింగి: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాల్సిందేనని తెలంగాణ రాష్టమ్రంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజేంద్రనగర్ మండలంలోని చిత్రపూరి కాలనీలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపు నిచ్చారు. అంతేకాకుండా నాటిన మొక్కలను ప్రజలందరూ సంరక్షించుకోవాలన్నారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. చిత్రపూరి కాలనీలో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.