రంగారెడ్డి

ఘటం ఎదుర్కోళ్లతో మల్కాజిగిరిలో బోనాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, జూలై 17: ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం రాత్రి మల్కాజిగిరి గౌతంనగర్‌లో నిర్వహించిన ఘటం ఎదుర్కోళ్లతో బోనాల జాతరకు ఇక్కడ అంకురార్పణ జరిగింది. మల్కాజిగిరిలోని చారిత్రత్మకమైన శ్రీ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు జాతర జూలై 31న సామూహిక బోనాలు సమర్పణ, ఆగస్టు 1 సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పదిహేను రోజుల ముందుగానే ఘటం ఎదుర్కోళ్లతో అమ్మవారిని తీసుకోచ్చి శ్రీ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆదివారం నిర్వహించిన ఘటం ఎదుర్కోళ్ల కార్యక్రమం హట్టహసంగా జరిగింది. శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి దేవాలయ కమిటీ నిర్వహకులు మల్కాజిగిరి కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ ఘటంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాండ్ మేళాలతో అమ్మవారి ఘటంకు ఘన స్వాగతం పలికారు. సోమవారం నుంచి పదిహేను రోజుల పాటు మల్కాజిగిరిలోని పురవీదుల్లో ఘటంను ఇంటింటికీ తీసుకొచ్చి అమ్మవారి దర్శనం అందజేస్తారు. ఇంటికొచే అమ్మవారికి వేప మండలం వేసి ఉన్న బిందెతో సాక సమర్పిస్తారు. పదిహేను రోజులు పూర్తికాగానే అమ్మవార్లకు ప్రజలంతా సామూహిక బోనాలు సమర్పిస్తారు. సోమవారం అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి రంగం కార్యక్రమం వైవభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే ఫలహరం బండి ఊరేగింపు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. పోతరాజుల నాట్య విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. పదిహేను రోజుల పాటు అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు కన్నుల పండువగా నిర్వహిస్తారు.