రంగారెడ్డి

ఇంత నాసిరకం పనులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 19: చందానగర్‌లోని పిజెఆర్ స్టేడియంలోజరుగుతున్న అభివృద్ధి పనులను గ్రేటర్ అడిషనల్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు తనిఖీ చేశారు. స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితోకలిసి అక్కడ జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సుమారు కోటిన్నర లక్షల అంచనా వ్యయంతోబాస్కెట్ బాల్, వాలీబాల్,క్రికెట్ గ్రౌండ్ నిర్మాణ పనులు, స్టేడియానికి పెయింటింగ్ పనులను చేపట్టారు. బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో ఏర్పడిన పగుళ్లను చూసి కోపోద్రిక్తులై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన గ్రౌండ్‌ను తిరిగి తవ్వించి వాటి నాణ్యతను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోరింగ్ ఆరు ఇంచుల మందం వేయాల్సి ఉండగా నాలుగు ఇంచుల మందం మాత్రమే ఉందని, నాణ్యతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదని శేరిలింగంపల్లి సర్కిల్ 12 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హన్మంతరావు, డిఇ శ్రీనివాస్‌రావులను నిలదీశారు. ఇది క్రికెట్ స్టేడియమేనా, ఇంత అధ్వాన్నంగా పనులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని గేమ్స్ ఇన్‌స్పెక్టర్ శ్యాంరావును ప్రశ్నించారు. స్టేడియానికి రూ.20లక్షల వ్యయంతో వేసిన పెయింటింగ్ చాలా నాసిరకంగా ఉందని, బాధ్యతలు నిర్వహించడంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని, మెమో జారీ చేస్తానని హెచ్చరించారు.
పిజెఆర్ స్టేడియంగా నామకరణం చేయాలి: కార్పొరేటర్ నవతారెడ్డి
జిహెచ్‌ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు పిజెఆర్ స్టేడియంగా వెంటనే పేరు మార్చాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి అడిషనల్ కమిషనర్‌ను కోరారు. గత కౌన్సిల్‌లో తీర్మానం చేసి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పిజెఆర్ స్టేడియంగా నామకరణం చేయకపోవడం సబబుకాదన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని, పిజెఆర్ స్టేడియం పేరుతోకమాన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. స్టేడియం నిర్వహణ నూతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. గత కమిటీలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకుడిని వైస్ చైర్మన్‌గా నియమించడంతో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. స్టేడియానికి తగినంత సెక్యూరిటీ సిబ్బంది లేరని, నియమించిన వారిలోసగం మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, పారిశుద్ధ్య సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని కార్పొరేటర్ అన్నారు. ఇందులో టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బ విజయ్ రెడ్డి, జె.కృష్ణారెడ్డి, పోచయ్య, ప్రసాద్, చందర్‌రావు, రాజన్న ఉన్నారు.