రంగారెడ్డి

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో మోసం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూలై 21: ఆర్మీ ఉద్యోగాల అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో నలుగురు యువకులు జైలు పాలైన సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఆసీఫ్‌నగర్ ఏసీపీ గౌస్‌మొహినుద్దీన్ వివరాలను వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన గుల్షాన్ కుమార్, బిహార్‌కు చెందిన నిసార్ హైమ్మద్, ఢిల్లీ ప్రాంతానికి చెందిన అక్షయ్ మోహేతా, హర్యానాకు చెందిన ప్రవీణ్.. నాలుగురు యువకులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని గోల్కొండ ఆర్మీ ఉన్నతాధికారులను ఈనెల 19న కలిశారు. వీరు ఢిల్లీ నుంచి తాము ఉద్యోగం కోసం వచ్చామని తెలిపారు. ఇటీవలే ఆర్మీలో ఉద్యోగాలు కోసం ఢిల్లీ ఉన్నతాధికారుల అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో 16మంది ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వారందరినీ గోల్కొండ సెంటర్‌లో ఉన్న ఆర్మీ అధికారులు పరిశీలించారు. వారిలో నలుగురి అపాయింట్‌మెంట్ ఆర్డర్లపై అనుమానం వచ్చి ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారిని తాము పంపించలేదని తెలుపడంతో వెంటనే ఆర్మీ అధికారులు.. గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని రిశ్యాం సింగ్, పవన్‌సింగ్ ఇద్దరు తమ వద్ద లక్షలు దండుకొని అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారని నలుగురు యువకులు తెలిపినట్లు ఏసిపి పేర్కొన్నారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. వీరికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చిన మరో ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏసిపి తెలిపారు.