రంగారెడ్డి

మల్లన్నసాగర్ బాధితులపై లాఠీచార్జి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 24: మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలకు సంబంధించిన భూముల సేకరణ విషయమై నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై పోలీసులు అమానుషంగా జరిపిన లాఠీచార్జీ, భాష్పవాయు ప్రయోగాన్ని ఖండిస్తున్నట్లు జిల్లా జెఎసి తూర్పు విభాగం కన్వీనర్ నాగుర్ల సంజీవరావు పేర్కొన్నారు. ఆదివారం మేడ్చల్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులు అమలు చేస్తున్న దమన నీతిని తూర్పారబట్టారు. సర్కార్ దౌర్జన్యపూరిత విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై పోలీసులు ఆదివారం జులుం చేయడం అన్యాయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగం కలిపించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేనపుడు వారి అభిప్రాయాలను తమకు వీలున్న పద్ధతుల్లో అందుబాటులో ఉన్న మార్గాలలో వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారని వివరించారు. ఎంతో మంది త్యాగధనుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అవకాశాలు లేకపోవడం నిరంకుశ పాలనను తలపిస్తుందని ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై సాయుధ పోలీసులతో అణచివేసేందుకు బలప్రయోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రతీ ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలపై ఆకారణంగా దౌర్జన్యం చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు సంబంధించిన సమగ్ర నివేదిక (డిపిఆర్)ను ప్రజా క్షేత్రంలో చర్చకు పెట్టి అందరి అభిప్రాయాలను స్వీకరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ప్రాజెక్ట్ కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలని, భూముల రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.