రంగారెడ్డి

హరితహారం చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో చారిత్రాత్మకమైనదని దీనిలో ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి కోరారు. గురువారం మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలోని అత్వెల్లి శివాలయం సమీపంలో ఓ వెంచర్ పార్కు స్థలంలో బాలానగర్ జోన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సిఎం కేసిఆర్ ఎంతోముందు చూపుతో హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని ఇందులో అన్ని ప్రభుత్వ శాఖలు తమవంతు పాత్రను చురుకుగా పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పటికే 50వేల మొక్కలను నాటామని చెప్పారు. గత ప్రభుత్వాలు పచ్చదనాన్ని పట్టించుకోకపోవడం చేతనే నేడు దుష్ఫలితాలు ఎదుర్కొంటున్నామని కరవుకాటకాలతో అల్లాడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోకూడదని బృహత్తరమైన హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేకానేక మైరుగైన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ నీరు లేకపోతే అవి అన్ని వృధానేనని పచ్చదనం పరిఢవిల్లితేనే నీరు ఉంటుందని పేర్కొన్నారు. చెట్ల ప్రాముఖ్యతను గుర్తించింది నాడు అశోక చక్రవర్తి నేడు ముఖ్యమంత్రి కెసిఆర్‌యేనని కొనియాడారు. అడవులను ఇష్టానుసారంగా నరికివేయడంతోనే కోతులు జనావాసాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటామని ఇంకా నాటేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. తన అధీనంలో ఉన్న హోం, లేబర్, ఉపాధికల్పన శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. చెట్లతోనే రాష్ట్రంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని తద్వారా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెరువుకుంటలలో నీరు చేరి పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ రైతుల ఆత్మహత్యలు కూడా కనుమరుగు అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ప్రధాన మంత్రి ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు సిఎం కెసిఆర్ కేవలం రెండు సంవత్సరాల పాలనలో చేపట్టి వాటిని దిగ్విజయంగా అమలు చేసి చూపించారని కొనియాడారు. కాకతీయ రెడ్డి రాజుల కాలంలో చేపట్టిన గొలుసు చెరువులు సమైక్య పాలనలో నాశనమయ్యాయని వాటన్నింటికీ మిషన్ కాకతీయ ద్వారా పునర్‌వైభవం తీసుకువస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం వంటి కార్యక్రమాలపై యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తుందని ఇలాంటి పథకాలను ప్రతీ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని వివరించారు. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతోనే ముందుకుసాగామని వాటన్నింటిని ప్రస్తుతం నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. టిడిపి, కాంగ్రెస్‌ల హయాంలో రాష్ట్రంలో నిధులులేవని ప్రస్తుతం సర్కార్ వద్ద పుష్కలమైన నిధులున్నాయని కేవలం సంక్షేమ పథకాల అమలు కోసమే రూ. 58 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు పుట్టగతులుండవనే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయని ఇందులో భాగంగానే ప్రజలను రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. సర్కార్ చేపడుతున్న మల్లన్నసాగర్ ద్వారా నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మేడ్చల్‌లో కూడా నీటి సమస్య తీరుతుందన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఇంకా రెండు గ్రామాల ప్రజలు మాత్రమే మిగిలిపోయారని వారు కూడా తమ గ్రామాలను అప్పగించేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి వివరించారు. ప్రతిపక్షాలు కుట్రలు పన్ని ప్రజలను దొంగచాటుగా రెచ్చగొడుతున్నాయని అయినప్పటికీ పోలీసులు ఎంతో సంయమనం పాటించారని వివరించారు. ప్రతిపక్షాలు పొలాలను ధ్వంసం చేసినా పోలీసులు సంయమనం కోల్పోలేదని పోలీసులపై దాడికి పాల్పడటంతోనే లాఠిచార్జీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని రకాలుగా సహకారం చేస్తూ వచ్చామని గడబిడ సృష్టించింది ప్రతిపక్షాలేనని మంత్రి విమర్శించారు.
నీళ్ల కోసం కొట్లాడిన కోదండరామ్ ప్రతిపక్షాలతో కలువడం దురదృష్టకరమని ఇది తనకు ఒకింత ఆశ్చర్యం కలిగించిందని మంత్రి నాయిని వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రేవంత్‌రెడ్డికి ఏపిలో రాజధాని పేరిట వేల ఏకరాల రైతుల భూములను లాక్కున్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. టిడిపికి ఏపిలో ఓ వైఖరి తెలంగాణలో ఓ వైఖరి ఉంటుందా అంటూ మంత్రి ఏద్దేవా చేశారు. ప్రజలు ప్రభుత్వం పక్షాన ఉన్నారని ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నంతసేపు ఏవరు ఏం చేయలేరని అన్నారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రతిపక్షాల వలలో పడవద్దని హోంమంత్రి ఈ సందర్భంగా విఙ్ఞప్తి చేశారు. ఎంసెట్-2 లీక్‌పై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు.
కుంభకోణాలకు అవినీతికి తావు లేకుండా టిఆర్‌ఎస్ జనరంజకమైన పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి, బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ డివిజన్ ఎసిపి అశోక్‌కుమార్, ఎంపిపిలు విజయలక్ష్మీ, చంద్రశేఖర్‌యాదవ్, నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహాయం, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ లింగా కృష్ణమూర్తి గుప్త, సర్పంచ్ రాజమల్లారెడ్డి, నాయకులు నందారెడ్డి, విష్ణుచారి, రాఘవేందర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కందాడి రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐలుకిషోర్, గ్యార పవన్‌కుమార్, శ్రీహరి, గోపరాజు, వీరబ్రహ్మం, పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొని సుమారు 2 వేల మొక్కలను నాటి వాటికి నీరు పోశారు.