రంగారెడ్డి

విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 19: గ్రామంలోని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించాలని టియుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.విఠల్, ఆర్.వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వేసవిలో జిల్లాలో 53 రోజుల పాటు కరవు దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం గ్రామీణ విద్యార్థులకు ఎంతో లాభదాయకమని అభివర్ణించారు. మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు అన్ని పాఠశాలలకు తాగునీరు సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. జిల్లాలో ఇప్పటికే చాలా మండలాల్లోని గ్రామాల్లో వేసవి కారణంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నదని పేర్కొన్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు దొరికే పరిస్థితి లేదని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు పరిష్కరించకుండా మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యతను ప్రధానోపాధ్యాయులపై పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా తాగునీటి వసతిని కల్పిస్తేనే మధ్యాహ్న భోజనం అమలు సాధ్యపడుతుందని సూచించారు. ఎండలు సైతం తీవ్ర స్థాయిలో ఉన్నాయని, వాటి నుండి విద్యార్థులను కాపాడాలని కోరారు. చాలా మంది ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి మధ్యాహ్న భోజనం తిని రావాలంటే అది సాధ్యం కాదని గ్రామంలోనే చదువుకునే ప్రతి విద్యార్థినికి భోజనాన్ని అందించాలని కోరారు.