రంగారెడ్డి

తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగష్టు 4: తల్లి దండ్రులు, గురువుల పట్ల గౌరవం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ప్రముఖ మానసిక నిపుణుడు బివి పట్ట్భారామ్ అన్నారు. మండల పరిధి ఘనపూర్ గ్రామంలోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఓరియేంటేషన్ కార్యక్రమం జరిగింది. నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థినీ విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని నైపుణ్యతను సంపాదించేందకు వినియోగించాలన్నారు. తోటి విద్యార్థుల పట్ల సోదర భావంతో మెలిగితే మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు. ర్యాగింగ్‌లకు పాల్పడటం వల్ల అభద్రతాభావం నెలకొని చదువుపై దృష్టి సాధించటం కష్టతరంగా ఉంటుందన్నారు. కళాశాలలో చేరికకు ముందే ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేవరకు విశ్రమించకుండా ప్రయత్నించాలన్నారు. దీంతో కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు సిద్ధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రవి, బిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ గిరిజారమణ, ఏఒ కిరణ్‌కుమార్, క్యాంపస్ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.