రంగారెడ్డి

బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ ఇళ్లకు ఇ-వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఆగస్టు 5: బండ్లగూడ, పోచారంలో ఉన్న రాజీవ్ స్వగృహ భవనాలలో రూ.50 కోట్ల నిధుల ఖర్చుతో అన్ని వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవాం బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను సందర్శించారు. అన్ని బ్లాకుల్లో కలయతిరిగి అక్కడ ఉన్న వసతులతోపాటు నిర్మాణాలను పరిశీలించారు. సుమారు 2500వరకు ఉన్న ఇళ్ల భవనాలకు సంబంధించిన బ్లాకులు దూరప్రాంతంలో ఉండటంతో బస్సులో వెళ్లి పరిశీలించారు. ఖాలీగా ఉన్న ప్లాట్స్‌తో పాటు, నివాసం ఉంటున్న ఫ్లాట్లను సైతం పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2008లో ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్లు నాలుగువేల వరకు నిరుపయోగంగా ఉన్నాయని తెలిసి అధికారులకు ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. అధికారులు ముందుకు రాకపోకడంతో వేలం ద్వార పారదర్శకంగా అమ్మకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్వహించనున్న వేలం పాటలో పాల్గొని ప్లాట్లను కైవసం చేసుకోవాలని కోరారు. సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా వపతులతో నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. చక్కటి వాతవరణంలో అన్ని వసతులతో నిర్మించిన ఈ ఇళ్లను కొనుగోలు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎంఎస్‌టిసి సంస్థ ఆధ్వర్యంలో ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఇళ్ల అమ్మకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే మెదటిసారిగా పెద్ద మెత్తంలో నిర్వహిస్తున్న వేలం పాటలో ఇతర దేశాలలో ఉన్నవారు కూడ ఆన్‌లైన్ ద్వార వేలంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇ-వేలం పాట ఈనెల 7 నుంచి 17వరకు ఉంటుందని, ఆసక్తి గలవారు రూ.1150 చెల్లించి రిజిష్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్లాట్లను వేలంలో దక్కించుకున్నవారికి నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకులు రుణ సౌకర్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆర్థాక స్థోమతకు అనుగుణంగా ఇళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
బండ్లగూడ, పోచారంలో నిర్మించిన రాజీవ్ స్వగృహా ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను రాజీవ్‌గృహాకల్ప ఎండి అశోక్‌కుమార్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వేలం పాటలో పాల్గొనేవారు ఎంఎస్‌టిసి లాగిన్ ద్వారా అన్ని వివరాలను తెలుసుకొవచ్చని చెప్పారు. ప్రభుత్వం ధర స్కేర్ ఫీట్‌కు రూ.2800 నిర్ణయించినట్లు పేర్కన్నారు. వేలం పాటలో పాల్గొనేవారు 10వేలు ఇఎంఐ డిడి ద్వారా చెల్లించాలని, ఎక్కువ కోట్ చేసినవారికి ప్లాట్ దక్కుతుందని చెప్పారు. కార్యక్రంలో స్థానిక కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్, కొప్పుల విఠల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం.రాంమోహన్ గౌడ్, చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, జిఎం శంకర్, డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు పంగ శ్యాంకుమార్, చెర్కు జంగయ్యగౌడ్, కత్తుల రాంబాబు పాల్గొన్నారు.
సమస్యలను వెల్లడించిన
నివాసితులు
రాజీవ్ స్వగృహాలో కొంత కాలంగా ఇళ్లు కొనుగొలు చేసుకొని నివాసం ఉంటున్న నివాసితులు సమస్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి విన్నవించారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తామంటేనే ఐదు ఏళ్ల క్రితం ఇళ్లను కొనుగోలు చేశామని వివరించారు. కానీ, అప్పటి నుంచి తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. వౌళిక వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కొనుగోలు ధర తగ్గించినట్లయితే ఇళ్లు అమ్ముడు పోతాయని మంత్రికి ఓ మహిళ సూచించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తగ్గించలేమని వివరించారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.