రంగారెడ్డి

నిషేధిత పరికరాలను వాడుతున్న ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 20: ఫంక్షన్ హాల్స్‌లో నిషేధిత పరికరాలను వాడుతున్న ముగ్గురు వ్యక్తులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి అశోక్‌కుమార్, సిఐ డివి రంగారెడ్డి వివరాలను వెల్లడించారు. కూకట్‌పల్లి, శాంతినగర్‌కు చెందిన కటారామ్ రూప్‌కుమార్ (30) దిల్‌సుఖ్‌నగర్, శాంతి రెసిడెన్సీ నివాసితుడు బండారు యుగంధర్ (34), కుత్బుల్లాపూర్, రామరాజునగర్ కాలనీలో నివాసముండే కృష్ణకాంత్ రెడ్డి (31) ఈనెల 19న వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో డ్రోన్ కెమెరాను వాడి పెళ్లి దృశ్యాలను చిత్రీకరించారు. పోలీసులు కేసునమోదు చేసి డ్రోన్ కెమెరాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. డ్రోన్ కెమెరా, లేసర్ లైట్, టపాసులు, డిజెలు వంటి పరికరాలను పేటబషీరాబాద్ పరిధిలోని 24 ఫంక్షన్ హాల్స్, డివిజన్‌లోని 50 ఫంక్షన్ హాల్స్‌లో సిపి నిషేధిత ఉత్తర్వులను జారీచేశారని, పెళ్లిళ్లు, ఊవెంట్‌లలో నిషేధిత పరికరాలను పదేపదే వాడుతున్నారని, రెండు, మూడు కేసులు నమోదైన అనంతరం హాల్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని వివరించారు. నిషేధిత పరికరాలు వాటడము వలన ఉగ్రవాద చర్యలు జరుగవచ్చునని, భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని ఎసిపి అశోక్‌కుమార్ చెప్పారు.

ద్విచక్ర వాహన దొంగల అరెస్టు
హయత్‌నగర్, ఏప్రిల్ 20: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నేరేడ్‌చర్లకు చెందిన షేక్ నయూబ్స్రూల్ (24) దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రతిభ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చాడ విజయ్‌కుమార్ (28) దిల్‌సుఖ్‌నగర్‌లోని గాయత్రి హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నారు. వాహనాల తనిఖీల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుండి 5ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.