రంగారెడ్డి

నేడు రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 21: నగరంలోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబోయే రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ కోరారు. గురువారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపి కవిత హాజరవుతారని చెప్పారు. ఈనెల 27న ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్లీనరీలో 12 అంశాలపై చర్చతో పాటు సిఎం కేసిఆర్ సందేశమిస్తారని తెలిపారు. ప్లీనరీ నిర్వహించే 27వ తేదీకి ముందే అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ సమావేశాలు పూర్తి చేసుకుంటారని అన్నారు. రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశానికి ఎంపి కవిత రావడం ప్రాముఖ్యత సంతరించుకోనుందని చెప్పారు. సమావేశానికి జిల్లా మంత్రి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరవుతారని జడ్పీటిసి, జిల్లా కార్యదర్శులు, మండల, పట్టణ, అనుబంధ సంస్థల నాయకులు హాజరు కావాలని కోరారు. ప్లీనరీకి రంగారెడ్డి జిల్లా నుండి కేవలం 180 నుండి 200 మంది జిల్లా నుండి హాజరయ్యేందుకు అనుమతి ఉందని, మరో 100 మందికి అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలన్నీ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సాధ్యం కాదని చెప్పిన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, ఇంటింటికీ నల్లా కనెక్షన్‌కు మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకేరోజు సిఎం కేసిఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దీనిపై ప్లీనరీలో 4000 మందితో చర్చ ఉంటుందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం రెండో విడతపైనా చర్చ జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో కెజి టు పిజి, డబుల్ బెడ్ రూం పథకం అమలు తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు.
పార్టీలో చేరిన వారిని, ఉద్యమం చేసిన వారి మధ్య సమన్వయం కోసం ప్రతి మూడు నెలలకోసారి మండల, నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించి చర్చ జరిపి, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం మిగిలిపోయి ఉన్న టిడిపి నాయకులను టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో జరిగిన జడ్పీటిసి, సర్పంచ్ స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుందని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం పార్టీ నేతలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అస్లాం ఫెరోజ్, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు జి.విజయేందర్‌గౌడ్ పాల్గొన్నారు.