రంగారెడ్డి

సంపులో అనుమానాస్పదంగా ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 19: మంజీరా పైప్‌లైన్ సంపులో పడి ఉన్న రెండు మృతదేహాలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెందారా లేక ఎవరైనా చంపి పడేశారా అనే విషయం అనుమానాస్పదంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాలమురు జిల్లా కోయిలపల్లి మండలం, బూరుగుపల్లి గ్రామస్థులైన వీరిరువురూ సనుమన్ల సాలప్ప (50), కడుమంచు వెంకటయ్య (48) కుటుంబాలు 12 ఏళ్లగా మియాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన లక్ష్మీనగర్ సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరు ఆడ వేషధారణతో బిక్షాటన చేస్తూ భార్య, పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. కాగా శుక్రవారం మృతులు నివసిస్తున్న గుడిసెల సమీపంలోనున్న మంజీరా మెయిన్ పైప్‌లైన్ సంపు వద్దకు నీటి కోసం వెళ్లిన మహిళలకు లోపల మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కొత్వాల్, ఎస్‌ఐ భూపాల్‌గౌడ్, పోలీసు సిబ్బంది మృతదేహాలను వెలికితీసి శవపంచనామా నిర్వహించారు. పీకలవరకు మద్యం తాగి ఉన్నవారు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెంది వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. లక్ష్మీనగర్ ప్రాంతంలో సుమారు 50 గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల్లోని మగవారు ఆడవేషధారణలో షాపులు, బస్టాపులు, వాహనదారులు, పాదచారుల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.