రంగారెడ్డి

తాండూరు పేరుతో జిల్లా ఏర్పాటు చేయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఆగస్టు 21: రంగారెడ్డి జిల్లాను విభజించి, పశ్చిమ గ్రామీణ ప్రాంతంలో వికారాబాద్ కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించటాన్ని ఆహ్వానిస్తున్నట్లు తాండూరు టిడిపి నాయకులు, బిసి సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
జిల్లాకు తాండూరుగా పేరును ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోనే అతి పెద్ద పట్టణంగా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో పురోభివృధ్ది సాధించిన తాండూరు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రతినెలా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుందంటూ టిడిపి నాయకులు ఎస్.సుశీల్ రాఙగౌడ్, ఎస్.సుమిత్‌గౌడ్, సి.మల్లన్న, పి.రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణం కర్ణాటక సరిహాద్దు ప్రాంతంగా ఉండటం దురదృష్టంగా మారుతుందని అన్నారు. తాండూరు పురోభివృద్ధిపై అనాధి కాలంగా పాలకులు వివక్ష ప్రదర్శిస్తున్నట్లు వాపోయారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో తలమానికంగా ఉన్న తాండూరు పేరుతోనే జిల్లాను ఏర్పాటు చేయాలంటూ పునరుద్ఘాటించారు.
తాండూరు డివిజన్ బిసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తాండూరు జిల్లా పేరుతో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను టిఆర్‌ఎస్ పాలకులు గుర్తించాలని కోరారు. లక్ష మందికిపైగా జనాభా కల్గిన తాండూరు పట్టణం నుండి దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకు, వ్యాపార, వాణిజ్య రంగాలతో సంబంధాలు ఉన్నయని పేర్కొన్నారు. తాండూరు నుంచి తెలంగాణ, ఏపి తెలుగు రాష్ట్రాలతోపాటు, అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఉన్నట్లు వివరించారు. తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఉన్నతి కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చొరవ చూపాలని కోరారు.