రంగారెడ్డి

మోదీ విదేశీ పర్యటనలతో ఒరుగబెట్టిందేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 21: దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోడానికే సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు అన్ని రంగాల కార్మికులు విధిగా పాల్గొని కార్మికుల ఐకత్యను చాటిచెప్పే విధంగా దిగ్విజయం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మేడ్చల్‌లో సిఐటియు ఆధ్వర్యంలో సన్నాహక సభను నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ అధ్యక్షతన నవభారత్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ కార్మికులు లేనిదే దేశ సంపద లేదన్నారు.
కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. అన్ని మారుతున్నా కార్మికుల జీవితాలు మారకపోవడానికి ప్రభుత్వా విధానాలే కారణమని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ కార్మికుల కడుపులు కొడుతున్నారని విమర్శించారు. 70 ఏళ్ల తర్వాత తిరిగి దేశంలో బానిసత్వం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం వెలికి తీస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ.. దానిని ఆచరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనలతో మోదీ ఓరుగబెట్టిందేమి లేదని ఇటీవల ఓ చిన్న దేశం పర్యటనకు వెళ్లిన మోదీ కేవలం కందిపప్పు తీసుకురావడం సిగ్గు చేటన్నారు. దేశంలో రాష్ట్రంలో ఆహారధాన్యాలకు కొదవలేనప్పటికీ విధానాల వల్ల నష్టం వాటిల్లుతుందని వివరించారు.
కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఫించన్‌ను రూ.3వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఎంపి, ఎమ్మెల్యేలుగా చేసినవారు రూ.25 వేల ఫించన్ పొందుతుండగా 40 ఏళ్లుగా కష్టపడిన కార్మికులకు ఫించన్ సౌకర్యం లేకపోవడం బాధకరామని అన్నారు. ముందుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మేడ్చల్ పట్టణంలో మహాప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ప్రదర్శన పట్టణంలోని పురవీధుల గుండా నవభారత్ ఫంక్షన్ హాల్ వరకు సాగింది.
సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె.రవి, కార్యదర్శి హరిప్రసాద్, నాయకులు నిర్మల, కిష్టప్ప, చింతల యాదయ్య, మనోరంజన్‌రెడ్డి, రమేశ్, జంగయ్య, చిన్నికృష్ణ, శ్రీనివాస్, ఆజయ్‌బాబు, సత్యనారాయణ, లక్ష్మన్, లింగాస్వామి, సుధ, వెంకటేశ్ పాల్గొన్నారు.