హైదరాబాద్

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, ఏప్రిల్ 21: బాలానగర్ మండలం శంషీగూడ గ్రామం సర్వేనెం.57 ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గురువారం ఎల్లమ్మబండ రైతుబజారు పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదు మేరకు బాలానగర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, విఆర్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది జెసిబిల సహాయంతో బేస్‌మెంట్లు, గదులను తొలగించారు. ఈ సందర్బంగా ఆర్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టే వారు ఎంతటి వారైనావారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. కొంతమంది కబ్జాదారులు ప్రభుత్వ స్థలంలో ప్రైవెట్ బోర్డులను ఏర్పాటు చేసి కబ్జాలకు పాల్పడుతూ ప్లాట్లుగా చేసి పేద ప్రజలకు అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నాదర్‌గుల్‌లో
సరూర్‌నగర్: అక్రమ నిర్మాణాలు, వెంచర్లు చేపట్టిన నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి టి.హెచ్.విజయశ్రీ హెచ్చరించారు. గురువారం బడంగ్‌పేట్ నగర పంచాయితీ పరిధిలోని నాదర్‌గుల్ సర్వే నెంబర్ 209, మహేంద్ర లోటస్, బడంగ్ పేట్ ఎస్‌బిఆర్ తదితర కాలనీల్లో అక్రమ వెంచర్లు, నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి విజయశ్రీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేపడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు జి.అంజయ్య, ఆర్.సత్యనారాయణరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.