రంగారెడ్డి

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 22: విద్యార్ధులు విద్యాభ్యసంలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సిపిఆర్‌ఐ ప్రధానాధికారి డాక్టర్ ప్రదీప్‌నిర్గుడే అన్నారు. మండల పరిధి ఎన్‌ఎఫ్‌సినగర్‌లోని కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రదీప్‌నిర్గుడే మాట్లాడుతు కేంద్రీయ విద్యాలయంలో అత్యుత్తమ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యా భోదన చేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్ధిని, విద్యార్ధులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నట్లు తెలిపారు. మొదటి తరగతి నుండే విద్యాభ్యాసంలో మంచి పట్టు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్ధి నిరంతరం అకుంఠిత దీక్షతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని సాధించాలన్నారు. విద్యాలయ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ బహుముఖ రీతిలో విద్యాలయం అభివృద్ధి చెందటానికి సమాజంలో అందరి పాత్ర అవసరమన్నారు.
విద్యార్ధులు భావిభారత పౌరులుగా ఎదగటానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడ శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్టివెన్, ఎంపిటిసి సభ్యుడు జంపాల రమేశ్, అధ్యాపకులు శ్రీనివాసులు, నీనాసింగ్, నజీర్, హరికిషన్, మహేందర్, కళ, జ్యోతిర్మయి, ముత్తు, సునీల్, ప్రసాద్, రజనీ, సూర్యనారాయణ, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ బతుకమ్మ పాట, రాజస్థానీ, ఉత్తరప్రదేశ్, కేరళ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నృత్యరీతులు విశేషంగా అలరించాయి.