రంగారెడ్డి

ఇంటి తాళాలు పగలగొట్టి సొత్తు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, ఆగస్టు 28: సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌ల పరిధిలలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో నాలుగు ఇళ్లల్లో దోపిడీ దొంగలు స్వైర విహారం చేసిన మరుసటి రోజు కెపిహెచ్‌బి స్టేషన్ పరిధిలోని నిజాంపేట బాలాజీనగర్‌లోని మెడోస్ విల్లాలో సుమారు రూ.15 లక్షల సొత్తు అపహరణకు గురైన సంఘటన మరవకముందే శనివారం అర్ధరాత్రి అదే ప్రాంతంలో మరోసారి రెండు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి సుమారు రూ.7 లక్షల రూపాయల సొత్తును అహరించుకొని పరారయ్యారు. ఇదే కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీ చేసిన సంఘటనలు సిసి కెమెరా పుటేజీలలో లభించగా వారి కోసం పోలీసులు వేట సాగిస్తుండగానే మరోమారు పంజా విసిరి పోలీసులకు సవాలు చేశారు. బాలాజీనగర్ మెడోస్ విల్లా నెం.18లో నివసించే రాహుల్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రాహుల్ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరెళ్లి తిరిగి వచ్చేప్పటికి ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. ప్రధాన ద్వారానికి అనుకొని ఉన్న కిటికి అద్దాలను తొలగించిన దొంగలు లోపలికి ప్రవేశించారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు రెండు కిలోల వెండి ఆభరణాలు చోరీ కాబడ్డాయి. కాగా మరో విల్లా నెం.21లో నివాసముంటున్న రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్‌రావు సొంత ఊరులో శుభకార్యం ఉండడంతో ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లాడు. విల్లా నెం.18లో దొంగతనానికి పాల్పడిన వారే 21లో కూడా దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాజేశ్వర్‌రావు ఊరు నుంచి రాకపోవడంతో ఎంత సొత్తు అపహరణకు గురైందనే విషయం తెలియాల్సి ఉంది.
దొంగతనాలతో స్థానికుల ఆగ్రహం
బాలాజీనగర్ మిడోస్ విల్లాస్‌లో వారం తిరిగకముందే మళ్లీ దొంగలు ఇదే ప్రాంతంలో పంజా విసిరడంతో స్థానికంగా నివాసముంటున్న వెంకట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాల్లాంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. దొంగలు మకాం వేసి పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారని, దీనిపై దృష్టి సారించాలని కోరారు.