రంగారెడ్డి

జ్ఞాన యోగమే వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 28: ఆధ్యాత్మిక చింతనలో జానయోగం, భక్తియోగం, కర్మయోగం, రాజయోగం వ్యక్తిత్వ వికాసంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాయని ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు, అఖిల భారత జాతీయ సత్యసాయి సేవా సంస్థల సమన్వయకర్త డాక్టర్ ఎన్.అంజనయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీసత్యసాయి జ్ఞాన కేంద్రం 14వ వార్షికోత్సవ సమావేశానిక ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీవాత్మ, పరమాత్మల సామరస్య ఫలితమే మోక్షప్రాప్తికి నిజమైన మార్గదర్శకాలని చెప్పారు. వేదములతో విజానం పుట్టిందని, వేదం లేనిదే ప్రపంచం లేదని పేర్కొన్నారు. ఖగోళ, నక్షత్ర, శాస్త్రాల అభ్యున్నతికి వేదమే మూలాధారమని స్పష్టం చేశారు. నేటి యుగంలో విద్యావంతులందరూ తమకే ప్రపంచం తెలుసునని చెప్పుకోవడం ఎంత అవాస్తవమో, జ్ఞాన యోగాన్ని గురించి తెలుసుకోకుండా మానవుడు జీవించడం అంతే అవాస్తవమని వివరించారు. భగవాన్ శ్రీసత్యసాయిబాబా వేద పురుషుడని తమ తాత్విక, ఆధ్యాత్మిక సమస్త జగత్తులోని మానవాళికి ఆదర్శంగా నిలిచారని వారి జీవితమే మానవ జాతికి సందేశమని అభిప్రాయపడ్డారు. సనాతన ధార్మిక ప్రబోధనలతో మానవాళిని ఒకత్రాటిపై నడిపించడానికి శ్రీసత్యసాయి సేవా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా నివసించే ప్రజలకు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస వంటి బోధనలతో ప్రజలను ఆద్యాత్మికత వైపు మళ్లిండచడానికి కీలకపాత్ర పోషిచేస్తున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని సత్యసాయి సేవా సంస్థలు ప్రేమ తత్వాన్ని సోదరభావాన్ని ప్రజల్లో పెంపొదిండంతో పాటు విద్య, వైద్య, వ్యవసాయ సేవలను గ్రామీణ ప్రజలకు అందించడంలో సమాజానికి ఆదర్శంగా నిలిచాయని సత్యసాయి సంస్థల జిల్లా అధ్యక్షుడు రామకుచేలు అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు, సాహితీ వేత్త డాక్టర్ రాఘవేందర్, వికారాబాద్ జిల్లా కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ హారతి ద్వారకనాథ్, పూర్వపు అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, డాక్టర్ పివి పున్నయ్య, ప్రశాంతి నిలయం ప్రతినిధి వీరారెడ్డి, న్యాయవాది గోపాల్‌రెడ్డి, జ్ఞాన కేంద్రం కార్యదర్శి పాపయ్య, కన్వినర్ సత్యనారాయణగౌడ్, బందెప్పగౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సాయి గాయత్రి యజ్ఞం భక్తులను ఆకర్షించింది. విద్యావిషయక పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. వృద్దులు, వేదపండితులు, అతిథులకు సన్మానంతో పాటు 14 మంది పేదలకు వస్తద్రానం చేశారు.