రంగారెడ్డి

జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఎల్‌ఐసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, సెప్టెంబర్ 1: ఎల్‌ఐసి 1956లో రూ.5కోట్లుతో ప్రారంభమై, నేడు రూ.22లక్షల కోట్లు ఆస్తులతోపాటు, 20కోట్లుపైనే లైఫ్ ఫండ్‌తో మహత్తర అభివృద్ధి సాధించిందని జోనల్ మేనేజర్ టిసి సుశీల్‌కుమార్ అన్నారు. ఎల్‌ఐసి వజ్రోత్సవం పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం మాసాబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలకు వౌలిక సదుపాయాల కల్పనలో గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సహాయంతో ప్రతి ఏడాది వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం అందజేస్తున్నామని అన్నారు.
ఈ జోన్ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయని, దాదాపు 1.56 లక్షలపైగా ఏజెంట్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి చేయూతనిస్తూ బీమాగ్రామ్ పథకాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కారించుకుని జోన్ పరిధిలోప్రతి డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున మొత్తం 17 గ్రామాలను దత్తత తీసుకున్నామని, ఈ గ్రామాలలో తాగునీటి సరఫరా కార్యక్రమాలకు, వాటర్ హార్వెస్టింగ్ లాంటి ఉపయోగకర పథకాలను గ్రామానికి దాదాపు 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని అన్నారు. ప్రతి బ్రాంచ్.. ఓ స్కూల్‌ను దత్తత తీసుకుని వౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. జాతీయాకరణ ఉద్ధేశ్యాలకు అనుగుణంగా ప్రజల నుంచి సేవకరించిన సొమ్మును సమాజ అభివృద్ధికి వెచ్చిస్తూ జాతి నిర్మాణంలో ఎల్‌ఐసి పాలుపంచుకుంటోందని తెలిపారు.