రంగారెడ్డి

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 8: తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్య్రం లభిస్తే నిజాం నిరంకుశ నవాబుల పాలనలో ఉన్న తెలంగాణకు 17 సెప్టెంబర్ 1948న విముక్తి లభించిందన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమసాధనలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినంగా పాటిస్తూ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారంలోకి రాగానే ముస్లింలకు భయపడి నోరుమెదపటం లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతంలో విమోచన దినాన్ని పాటించాల్సిందేనన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినం ప్రాముఖ్యతను తెలిపేందుకు బిజెపి ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈప్రాంత ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రానున్న ఎన్నికలలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రానుందన్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత పటిష్టపర్చాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం మండల తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మండల బిజెపి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నానావత్ బిక్కునాయక్, గుండ్ల బాల్‌రాజు, జిల్లా నాయకులు రామోజీ, అచ్చిని నర్సింహ్మ, ఎదుగని శ్రీరాములు, ఎంపిటిసి కరుణాకర్, సగ్గు మోహన్‌రావు పాల్గొన్నారు.