రంగారెడ్డి

మేడ్చల్‌నే జిల్లాగా ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంమర్ 8: ఎంతో ప్రాముఖ్యత కలిగిన మేడ్చల్‌నే జిల్లాగా ప్రకటించాలని కోరుతూ మేడ్చల్ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది చీదు హన్మంతురెడ్డి.. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. గురువారం ఆయన లేఖప్రతిని విలేఖరులకు అందజేశారు. నిజాం కాలం నుంచి మేడ్చల్ ప్రాంతం ఎంతో విశిష్టత ప్రాముఖ్యతను సంతరించుకుందని, అంతేకాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రులను మంత్రులను అందించిన ఘన చరిత్ర కలిగిందని వివరించారు. మల్కాజ్‌గిరికి బదులుగా మేడ్చల్ జిల్లాగా ప్రకటించాలని కోరారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, దుందిగల్, మల్కాజ్‌గిరి, శామీర్‌పేట్ జవహర్‌నగర్ మండలాలకు కేంద్రంగా ఉంటూ అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రవాణాపరంగా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, జాతీయ రహదారి, రైల్వేస్టేషన్‌ల సౌకర్యం ఉండటంతో ప్రజలకు సులువుగా ఉంటుందని వివరించారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవని, కావాల్సినంత ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో ఉన్నాయని పొందుపర్చారు. రెవెన్యూ డివిజన్‌గా కూడా మార్చడానికి ఎంతో అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. కీసరను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే రవాణాపరంగా ప్రజలకు కష్టాలు తప్పవని అది కాకుండా అందరికి ఆమోదయోగ్యంగా కూడా ఉండదని విన్నవించారు. సకల వసతులతో భాసిల్లుతున్న మేడ్చల్‌నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలందరు కొరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్ని మండలాల ప్రజల సౌకర్యార్ధం పరిపాలన సౌలభ్యం కోసం మేడ్చల్‌ను జిల్లాగా ప్రకటించి ఇక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేఖలో వేడుకున్నారు.
మల్కాజ్‌గిరి కాకుండా మేడ్చల్‌ను
జిల్లాగా చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా చేపడుతున్న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మల్కాజ్‌గిరికి బదులుగా అందరికి అనువుగా ఉండే మేడ్చల్ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని మేడ్చల్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మాట్లాడుతూ అన్ని రకాలుగా మేడ్చల్ ప్రాంతం జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అనువైనదని పేర్కొన్నారు. రింగ్ రోడ్డుకు అతి సమీపంలోని కండ్లకోయ గ్రామ పరిధిలోని సర్వేనంబర్లు 134, 135, 136, 137లలో 50 ఏకరాల భూమి ఉందని, ఇది పోలీసు అకాడమికి కేటాయించిన ఇప్పటి వరకు ఖాళీగానే ఉందని దీనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మేడ్చల్‌నే జిల్లాగా ప్రకటించాలని సుధాకర్‌రెడ్డి విఙ్ఞప్తి చేశారు.