రంగారెడ్డి

తల్లిదండ్రులకు ఫీజుల నుంచి విముక్తి కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9: ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయల ఫీజులు కుమ్మరించి చదువులు కొనుక్కునే దుస్థితి నుంచి తల్లిదండ్రులకు విముక్తి కల్పించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మదీనగూడలోని ది బనియన్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 71ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన 70మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపిక, పూలమొక్కతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ప్రైవేటు పాఠశాలల కన్నా మెరుగైన చదువు చెప్పాలని కోరారు. సెయెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ సహకారంతో దాదాపు 10కోట్ల రూపాయలతో 71స్కూళ్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారని, బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల విద్యాధికారి ఆర్.రాంచందర్‌రావు, బాలానగర్ మండల విద్యాధికారి ఎం.లక్ష్మయ్య, పిఆర్‌టియు శేరిలింగంపల్లి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టిఆర్‌ఎస్ నాయకులు ఉప్పలపాటి శ్రీకాంత్, సంజీవరెడ్డి, లద్దె నాగరాజు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఉపాధ్యాయులకు సన్మానం
మోమిన్‌పేట: మోమిన్‌పేట మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో పని చేస్తున్న కుల్సుంకు అవార్డు రావడం గర్వకారణమని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ముజీబ్, ఎంఇఓ శ్రీశైలం అభినందించారు. గురుపూజోత్సంను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన కుల్సుం, మండల అవార్డు గ్రహీత సక్క్భుయిని సన్మానించి అభినందనలు తెలిపారు.