రంగారెడ్డి

ఇంకుడు గుంతలోపడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, సెప్టెంబర్ 9: ప్రమాదవశాత్తు ఓ చిన్నారి బాలుడు ఇంకుడు గుంతలో పడి మృతి చెందిన సంఘటన కులకచర్ల మండలం బండవెనకచర్లలో శుక్రవారం జరిగింది. గండీడ్ మండలం లింగాయపల్లెకు చెందిన నర్సమ్మ తన మనవడిని తీసుకుని శుక్రవారం బండవెనకచర్లలోని ఓ ఆర్‌ఎంపి దగ్గరకు చికిత్సనిమిత్తం వచ్చింది. వస్తూవస్తూ తన నాలుగేళ్ల మనవన్ని కూడా వెంట తీసుకువచ్చింది. ఆర్‌ఎంపి దగ్గర చికిత్స నిమిత్తం ఆమె వేచిఉండగా చిన్నారి బాలుడు ఆడుకుంటూ మెల్లగా బయటకు వెళ్లాడు. అలా వెళుతూ సమీపంలోని ఇంకుడు గుంతలోకి వెళ్లి దాంట్లో జారి పడడంతో ఊపిరాడక మృతి చెందాడు. కొద్దిసేపటికి బాలుని అవ్వ తన మనవడిని వెతుక్కుంటూ వెళ్లగా ఇంకుడు గుంతలో విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆమె తన మనవన్ని తీసుకుని స్వగ్రామానికి వెళుతుండగా విషయం తెలుసుకున్న బండవెనకచర్ల వారు ఈ బాలుని మృతికి గ్రామసర్పంచ్ ఇంకుడు గుంతను పూడ్చివేయకుండా ఉండడం కారణమని ఆరోపిస్తూ కొద్దిసేపు సర్పంచ్ ఇంటి ముందు ఆందోళన చేయించారు.