రంగారెడ్డి

సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 11: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సోమవారం బిజెపి ఆధ్వర్యంలో మేడ్చల్ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మేడ్చల్ పట్టణ బిజెపి సమావేశం శ్రీనివాస కల్యాణ మండపంలో ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో పేరుకుపోయిన సమస్యలను అధికారులు పరిష్కరించడంలో ఎలాంటి చిత్తశుద్ధి కనబర్చడం లేదని ధ్వజమెత్తారు. సుమారు మూడు నెలల క్రితం పట్టణంలోని పలుసమస్యలను వివరిస్తూ నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డికి వినతిపత్రం అందించినా ఇప్పటిదాకా ఏ ఒక్క సమస్యను పర్కిరించిన పాపాన పోలేదని దీనిని బట్టి అధికారులకు ప్రజా సమస్యలంటే ఎంత చులకనో అర్ధమవుతుందన్నారు. అధికారులు కేవలం మామూళ్లు దండుకునే పనులు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి పనులు చేయడంలో చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు. పట్టణంలోని రైల్వేబ్రిడ్జి కింద నుండి ఎల్లమ్మతోట, కంట్రీ క్లబ్, సరస్వతీనగర్, రైల్వే కాలనీలకు చెందిన డ్రైనేజీ మురుగునీరు కాలువలా ప్రవహిస్తున్నా నగర పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీని కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆయా కాలనీ ప్రజానీకం వాహనదారులు నరకం చవిచూస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా పట్టణంలో వీధి దీపాలు వెలగడం లేదని విన్నవించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.
అదిగో ఇదిగో అంటూ మిషన్ భగీరథ పథకం కింద మేడ్చల్ ప్రాంతానికి గోదావరి జలాలు అందిస్తున్నామని ప్రకటనలు చేయడం తప్ప ఇప్పటిదాకా కాలనీలకు నీరు అందించడం లేదన్నారు. దీంతో ఆయా కాలనీలకు ప్రజలు గత్యంతరలేక వేలాది రూపాయలు చెల్లించి ట్యాంకర్‌ల ద్వారా నీరు తెప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. అంతేకాకుండా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర విషజ్వరాలు ప్రబలుతున్నాయని అయిన అధికారులు మొద్దునిద్ర వీడటంలేదని పేర్కొన్నారు. దోమల బెడదకు, పందుల స్వైర విహరానిక అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని దెప్పిపొడిచారు. నగర పంచాయతీ అధికారుల పనితీరు ప్రజా సమస్యల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ నేడు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు డివి కిషన్‌రావు, జె. నర్సింగ్‌రావు, సర్వేశ్వర్‌రెడ్డి, చీర్లరమేశ్, పోచయ్య, సందీప్‌గౌడ్, రాజేశ్‌గౌడ్, ధాత్రిక లక్ష్మణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.