రంగారెడ్డి

జిల్లా కోసం ఐదు గంటల పాటు ధర్నా రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 19: వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ చౌరస్తా నుండి బయలుదేరిన నాయకులు బస్‌డిపోకు చేరుకుని బస్‌డిపో గేటుకు తాళం వేయించి, డిపో ఎదుట టైర్లు తగలబెట్టారు.
ఎనె్నపల్లిలోని రెండు పెట్రోల్‌బంకులను బంద్ చేయించి, కూడలి వద్ద టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న సంఘం లక్ష్మిబాయి గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు జిల్లాలో జోనల్ క్రీడల ముగింపు కార్యక్రమాన్ని అడ్డుకుని టెంట్‌ను కూల్చారు. కార్యక్రమానికి హాజరైన గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి శేషకుమారికి బంద్ విషయం వివరించి వెనక్కి పంపారు. ఆతర్వాత వికారాబాద్-హైదరాబాద్ దారిలోని రోడ్‌ఓవర్ బ్రిడ్జిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వికారాబాద్‌కు నష్టం చేస్తున్నాడంతూ మంత్రి మహేందర్‌రెడ్డిపై నాయకులు దుమ్మెత్తిపోశారు. దాదాపు ఐదు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో హైదరాబాద్‌కు, పరిగి, సిద్దులూర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. రాస్తారోకోకు ప్రజలు సైతం మద్దతు పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖర్‌రెడ్డి, పార్లమెంటు ప్రధానకార్యదర్శి జె.వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు సతీష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మతిన్, ప్రమోద్‌కుమార్, భూపాల్‌రెడ్డి, శివకుమార్, జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఐదంతస్థులపైకి ఎక్కిన యువకులు
ఇదిలా ఉండగా 19 మండలాలతో వికారాబాద్ జిల్లా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు బస్‌డిపో ఎదురుగా ఉన్న ఐదంతస్తుల భవనంపైకి ఎక్కగా, మరో నలుగురు యువకులు ఎన్టీఆర్ కూడలిలోని భవనంపైకి ఎక్కారు. స్థానికులు వారించడంతో వారు వెనక్కి తగ్గారు.
కొత్తగడి వద్ద వంటవార్పు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి వద్ద గ్రామస్తులు వంటవార్పుతో నిరసన తెలిపారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు వచ్చి వారించడంతో రోడ్డుకు అడ్డంగా వేసిన కట్టెలు, బండరాళ్లు తొలగించారు. న్యాయమైన జిల్లా కోరిక తీరే వరకు విశ్రమించబోమని ప్రకటించారు.