రంగారెడ్డి

మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పారే చోట ఆగని లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 22: మేడ్చల్ పెద్ద చెరువు భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. గురువారం కూడా వందల సంఖ్యలో సందర్శకులు అపురూప దృశ్యాన్ని తిలకించడానికి తరలివచ్చారు. దాదాపు పది సంవత్సరాల తరువాత చెరువు నిండటంతో పట్టణ ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నారు. ప్రస్తుతం మేడ్చల్ పెద్ద చెరువు పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా అలుగు పారే వీలుంది. కాగా అలుగు పారే మెట్ల వద్ద లీకేజీ అగడంలేదు. లీకేజీ కారణంగా స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బుధవారం శాయశక్తులా కృషి చేసి కాంక్రీట్‌తో పూడ్చిన అది కాస్త భారీగా నిండిపోయిన నీరు కారణంగా తటుకోలేక పోయింది. దీంతో యధావిధిగా అలుగు వద్ద నీరు గురువారం కూడా లీకేజీ కాసాగింది. గురువారం కూడా మేడ్చల్‌లో విస్తారంగా వర్షాలు కురిసాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వర్షం నీరుతో పూర్తిగా నిండిపోయి చెరువులను తలపించాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాల చెరువులు కుంటలు జలకళను సంతరించుకోగా గురువారం కురిసిర వర్షానికి మరింత నీరు చేరుకుంది.