రంగారెడ్డి

బండారి లే అవుట్ కాలనీలో భయం భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 22: కుండపోత వర్షాలతో నిజాంపేట్ గ్రామం అతలాకుతలం అవుతుంది. గ్రామంలోని తుర్క చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు, తూముల ద్వారా నీటిని ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారు. తాత్కాలికంగా తీసిన తూము ద్వారా వచ్చే వరద నీరు బండారి లే అవుట్ కాలనీని ముంచెత్తింది. రెండు రోజులుగా గ్రామంలోని బండారి లేఅవుట్ కాలనీ నీటమునిగింది. దీంతో అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లలో వరద నీరు నిండింది. కాలనీ రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో కాలనీ వాసులంతా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు వరద నీటిలో నుండే రాకపోకలు సాగిస్తున్నారు. కాలనీలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అనే భయాందోళనలో ప్రజలు కాలాన్ని గడుపుతున్నారు. తుర్క చెరువు నుంచి బయటికి వస్తున్న తాత్కాలిక తూమును పూడ్చాలని కాలనీవాసులు కోరుతున్నప్పటికీ తూము మూస్తే చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అవసరమైతే మూడు ఫీట్లు ఉన్న తూమును 10 ఫీట్లు తీసి నీటిని మల్లించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
బండారి లేఅవుట్ కాలనీ వాసులకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు తాగునీటిని, బ్రెడ్‌లను పంపిణీ చేస్తున్నారు. ట్రాక్టర్‌లలో తాగునీటి బబుల్స్ ద్వారా నీటిని ప్రజలకు అందిస్తున్నారు. కాలనీలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లోనే రోజులు వెల్లదీస్తున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులుగా కాలనీలో అధికారులు రెండు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి చికిత్సలను చేస్తున్నారు. అంటురోగాలు వ్యాపించకుండా పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లుతున్నారు. సాధ్యమైనంత త్వరలో కాలనీలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.