రంగారెడ్డి

ప్రపంచంలోనే మహిళలకు ప్రత్యేకం బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, అక్టోబర్ 6: ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసమే ఉన్న ఏకైక పండుగ బతుకమ్మ మాత్రమేనని, పూవులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమని నగర మేయర్ సతీమణి నగర ప్రథమ పౌరురాలు బొంతు శ్రీదేవి అన్నారు. గురువారం రాత్రి చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలకు మేయర్ సతీమణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, హఫీజ్‌పేట కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్‌గౌడ్, భారతినగర్ కార్పొరేటర్ వి.సింధు ఆదర్శరెడ్డి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్, మహిళా నేతలతో కలిసి ఆమె పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మహిళలు, చిన్నారులతో కలిసి కొంతసేపు ఉత్సాహంగా కోలాటం ఆడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన, అత్యంత విశిష్టత కలిగిన బతుకమ్మ పండుగకు సిఎం కెసిఆర్ పూర్వవైభవం తెచ్చారని అన్నారు. ఇంత భారీ ఎత్తున బంగారు బతుకమ్మ సంబురాలు నిర్వహించినందుకు కార్పొరేటర్ నవతారెడ్డిని మేయర్ సతీమణి శ్రీదేవి అభినందించారు. నగర ప్రథమ మహిళ బొంతు శ్రీదేవి, కార్పొరేటర్లు వి.పూజిత, సింధు, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత నాగేందర్‌యాదవ్, టిఆర్‌ఎస్ మహిళా నేత మమత, ఉమామాలినిలకు చందానగర్ కార్పొరేటర్ నవతరెడ్డి పూల మొక్క బహుకరించారు. బతుకమ్మ సంబురాల్లో మహిళా నాయకులు వరలక్ష్మి, సులోచన, ఆశారెడ్డితోపాటు భారీ సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు, టిఆర్‌ఎస్ నాయకులు బొబ్బ విజయ్‌రెడ్డి, గుర్రపు రవీందర్‌రావు, మిరియాల రాఘవరావు, బి.కరుణాకర్‌రెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, పారునంది శ్రీకాంత్, కృష్ణారెడ్డి, పోచయ్య, మిరియాల ప్రకాష్ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌లో..
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. సర్కిల్ ఇన్‌చార్జి ఉపకమిషనర్ మమత ఆధ్వర్యంలో బతుకమ్మ ఆట, పాటలను నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు కెఎం పద్మ, దేవగారి శాంతిశ్రీ, రషీదాబేగంతో పలు శాఖల అధికారులు బతుకమ్మ పాటలను పాడుతూ ఆటలాడారు.
సిటీ పోలీసు ఆధ్వర్యంలో
హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పోలీసు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు డిసిపి, ఏసిపి, ఇన్‌స్పెక్టర్ స్థాయి మహిళా పోలీసు అధికారులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బతుకమ్మ సంబురాల్లో భాగంగా నగర పోలీసు విభాగం ఆధ్వర్యంలో గురువారం గోషామహల్ స్టేడియంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో మహిళ పోలీసు ఉన్నతాధికారులు స్వాతిలక్రాతో పాటు నార్త్ జోన్ డిసిపి సుమతి, ఏసిపి కవిత వివిధ పోలీస్టేషన్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. నగర పోలీసు అదనపు కమిషనర్‌లు జితేందర్, శ్రీనివాస్‌లతో పాటు డిసిపి, అదనపు డిసిపి, ఏసిపి, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. అదనపు పోలీసు కమిషనర్ (సిట్,క్రైమ్) స్వాతిలక్రా మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడంతో ప్రతి శాఖలో రోజూ మహిళా ఉద్యోగులు, అధికారులు బతుకమ్మ సంబురాల్లో ఉత్సహంగా పాల్గొంటున్నారన్నారు. బతుకమ్మ సంబురాల్లో మహిళా పోలీసు అధికారులు పాల్గొని బతుకమ్మ ఆడారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబురాల్లో భాగంగా గురువారం సాయంత్రం మేడ్చల్ పట్టణంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆడబిడ్డలు సంప్రదాయ భరితమైన వస్తధ్రారతో ఆదరగొట్టారు. పట్టణంలోని పెద్ద చెరువు, గ్రంథాలయం వద్ద, మేడ్చల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గడిమైసమ్మ ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు ప్రత్యేక లైటింగ్‌ను, డిజె సౌండ్ సిస్టంను ఏర్పాటు చేశారు. వందలాది మంది ఆడబిడ్డలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబై బతుకమ్మలను మధ్యలో పేర్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని తాను బతుకమ్మ పాటలుపాడి ఆడపడుచులను ఉత్సాహపరిచారు. సమైఖ్యపాలనలో మన పండుగలు వేడుకలు ఆదరణకు నోచుకోలేదని స్వయం పాలనలో మన పండుగలను ఘనంగా సంప్రదాబ్ధంగా జరుపుకుంటున్నామని ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించే పూలను పూజించే పండుగ బతుకమ్మ అని ప్రపంచంలో మన రాష్ట్రంలో తప్ప మరెక్కడ ఈ వేడుకలు జరుగవని వివరించారు. కాగా మేడ్చల్ పట్టణంలో ఏడవ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది. మండలంలోని మిగతా గ్రామాల్లో తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను సంప్రదాయంగా జరుపుకుంటారు. మండల పరిషత్ కార్యాలయంలో కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా అధికారులు ఆటపాటలతో అలరించారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు ఘట్‌కేసర్ మండలంలో అంబరాన్నంటాయి. ఘట్‌కేసర్ పండల కేంద్రంతో పాటు ఎన్‌ఎఫ్‌సినగర్, ప్రతాపసింగారం, చందుపట్లగూడ, బొక్కోనిగూడ గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపుకున్నారు. బతుకమ్మ పండుగ సంబరాలలో భాగంగా ఘట్‌కేసర్ జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. ఘట్‌కేసర్ పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీల మహిళలు ఘట్‌కేసర్ చిన్న చెరువు మైదానంలో బతుకమ్మలను పేర్చి తెలంగాణ పల్లె పాటలు పాడుతు ఆటలు ఆడారు. వృద్ధ మహిళలతో పాటు చిన్న పిల్లల వరకు బడుకమ్మ పండుగ వేడుకలలో ఉత్సహంగా పాల్గొన్నారు. ఎన్‌ఎఫ్‌సినగర్, బొక్కోనిగూడ, చందుపట్లగూడ గ్రామాలలో మహిళలు ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడారు. ప్రతాపసింగారం గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి చంద్రకళ, కోడలు దీప్తి.. పెద్ద బతుకమ్మను పేర్చి ప్రజలతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఘట్‌కేసర్ గ్రామంలో జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు విశేష స్పందన లభించింది. జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ గత రెండు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరిపించటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కులకచర్లలో..
కులకచర్ల: కులకచర్ల మండలంలో అధికారికంగా నిర్వహించే బతుకమ్మ పండుగ మొక్కుబడిగా సాగింది. మహిళా సంఘాల ప్రతినిధులు నామమాత్రంగా హాజరయ్యారు. ఎంపిపి గందె అరుణమ్మ, ఎంపిడిఒ సుభాషిణి పాల్గొని బతుకమ్మ ఆడారు. మండల తహశీల్దార్ కార్యక్రమానికి హజరుకాలేదు. మండల జడ్‌పిటిసి టూరులో ఉండటంతో ఆమె కూడా పాల్గొనలేదు. మొక్కుబడిగా నాలుగైదు గ్రామాల నుంచి కొంత మంది మహిళలు బతుకమ్మలను తీసుకువచ్చారు. ఎంపిడిఒ కార్యాలయ మహిళా సిబ్బంది కూడా పాల్గొనలేదు. కేవలం ఎంపిడిఒ, ఎపిఎం మాత్రం పాల్గొన్నారు. కొద్దిసేపు పాటలు పాడాక కార్యక్రమానికి హజరైన డిసిఎంఎస్ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, విపణి కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ నాగరాజు తదితరులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. వీరికి ఐకెపి పురుష ఉద్యోగులు తోడైనారు. అనంతరం సామూహికంగా బతుకమ్మలను మహిళలంతా కలిసి స్థానిక కుంటలో నిమజ్జనానికి వెళ్లారు.
వివేక్‌నగర్‌లో..
కెపిహెచ్‌బికాలనీ: వివేక్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కావ్యాహరీష్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నాయకులు చందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, తెలంగాణ జాగృతి సభ్యులు పూర్ణ, మనె్న నర్సింగరావు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి కోరారు. గురువారం బాలాజీనగర్ డివిజన్‌లోని రంగదాముని చెరువు కట్ట మీద సద్దుల బతుకమ్మ పండగ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. బతుకమ్మ ఉత్సవాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాల్సిందిగా కోరారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. జిహెచ్‌ఎమ్‌సి అధికారులు ఇఇ బాలనర్సయ్య, డిఇ గోవర్ధన్‌గౌడ్, ఎఇ శ్రావణి, టిఆర్‌ఎస్ సీనియర్ నేత పన్నాల హరీష్‌రెడ్డి పాల్గొన్నారు.