రంగారెడ్డి

వికారాబాద్ వద్దు అనంతగిరే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, అక్టోబర్ 9: నూతనంగా ఏర్పాటు చేసిన వికారాబాద్ కేంద్రంగా జిల్లాకు ఈప్రాంతంలో ప్రఖ్యాతిగా నిలిచిన శ్రీఅనంత పద్మనాభ స్వామి నిలయం అయిన అనంతగిరి పేరున జిల్లాను ఏర్పాటు చేయాలంటూ, మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సిఎం కేసిఆర్.. వికారాబాద్ పేరున జిల్లా నిర్ణయించటం సరికాదంటూ, అనంతగిరి పేరును జిల్లాకు పేట్టడం శుభదాయకం అవుతుందని, తాండూరులో ఆదివారం పట్టణ బిజెపి, బిసి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ముందుగా అనంతగిరి పేరుతో జిల్లా ఏర్పాటుకు అంగీకారం తెల్పిన కేసిఆర్ పూటకో మాట మార్చడం తమ ప్రాంతానికి అరిష్టమని బిజెపి నాయకులు ప్యాట బాల్‌రెడ్డి, పి.నారాయణరెడ్డి, గాజుల శాంతుకుమార్, పూజారి పాండూ, బొప్పి సురేష్, వైద్యలింగం, బి.్భధ్రేశ్వర్, కె.వాసు, టి.శ్రీనివాస్, బి.రాజ్‌కుమార్ విమర్శించారు. ఎవరికి భయపడి అనంతగిరి పేరును మార్పు చేశారో సిఎం తెలపాలని అన్నారు. మతోన్మాద శక్తులకు వత్తాసు పలకడం, మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బ తీయడం కేసిఆర్‌కు రివాజుగా మారిందని అన్నారు. ప్రతి అంశంలో వివాదాస్పద నిర్ణయాలు ప్రకటించడం, అందుకు ప్రజానీకం ఎదురు తిరిగితే మళ్ళీ నిర్ణయాలను మార్పు చేయడం తుగ్లక్ చేష్టలకు నిదర్శనమని ఎద్ద్దేవా చేశారు. గ్రామీణ జిల్లా ఏర్పాటులో సాహేతుకత పాటించకుండా నామకరణంలోనూ, ఈప్రాంత ప్రజానీకం మాటను గౌరవించక పోవడం సిగ్గు చేటన్నారు. జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు జిల్లా పేరును ఖరారు చేయడంలో కీలక పాత్ర వహించటం ఈ పాలకుల అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. జిల్లాకు అనంతగిరి జిల్లాగా మార్చే వరకు మళ్లీ ఉద్యమ పోరాటాలు మొదలు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.