రంగారెడ్డి

మెరుగైన పాలనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: జిల్లా ప్రజలకు మెరుకైన పాలన అందించే బాధ్యత అధికారులపై ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాఖల వారీగా సమస్యలేవైనా ఉంటే వాటిని సమీక్షించి అధిగమించి తద్వారా ప్రజలకు చేరువవుదామని సూచించారు. జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టరేట్‌లోనికి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ప్రపోజల్ ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలోని తొమ్మిది మండలాలు జిల్లాలో విలీనమైనందున గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లలో పర్యటించి సంబధిత మండల అధికారులతో సమీక్ష నిర్వహించి వాటపై పూర్తి సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పడిన మేడ్చెల్, వికారాబాద్ రెండు జిల్లాలు స్వతంత్ర పరిపాలన సాగించేందుకు వీలుగా సంబధిత జిల్లాల కరెంట్ ఫైళ్లను, కేటాయించిన ప్రభుత్వ వాహనాలు, ఫర్నిచర్‌ను త్వరగా పంపే ఏర్పాట్లను చేయాలన్నారు. జిల్లా కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు కలెక్టరేట్‌కు సమర్పించాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.