రంగారెడ్డి

నిందితున్ని కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 15: తమ గారాలపట్టీని అత్యంత కర్కశంగా హత్య చేసిన నిందిత బాలుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి మృతురాలు ప్రసన్న తల్లి భవాని, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం ఎల్లంపేట్ గ్రామంలోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ అభం శుభం తెలియని తన బంగారుతల్లిని పొట్టనబెట్టుకున్న నిందిత బాలుడిని(17) ఎట్టి పరిస్థితుల్లో కనికరించవద్దని, కఠినంగా శిక్షించి తన చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రోదిస్తూ పేర్కొన్నారు. సర్పంచ్ తుడుం లింగం, ఎంపిటిసి రేణుక, మండల బిజెపి అధ్యక్షుడు జగన్‌గౌడ్ తదితర నాయకులు ప్రజాప్రతినిధులు.. నిందిత బాలుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముక్కుపచ్చలారని చిన్నారిని కసాయిలా గొంతు కోసిన నిందిత మైనర్ బాలుడిని ఇతర నింధితులకు కనువిప్పు కలిగేలా శిక్షించాలని కోరారు.
నివేదికల ఆధారంగా నిర్భయ చట్టం కింద కేసు నమోదు
అభం శుభం తెలియని చిన్నారి సాయిలక్ష్మి ప్రసన్నను అతి క్రూరంగా గొంతు, మణికట్టు నరాలను కోసి హత్యచేసిన నిందిత మైనర్ బాలుడిపై నిర్భయ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని పేట్‌బషీరాబాద్ ఎసిపి అశోక్‌కుమార్‌ను ఆంధ్రభూమి ప్రశ్నించింది. చిన్నారితో లైంగిక నేరానికి పాల్పడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన బాలుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చెయవచ్చు కాదా అడుగగా స్పందించిన ఏసిపి ఫొరెన్సిక్ ల్యాబ్, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందిత మైనర్ బాలుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కొంత కాలం క్రితమే పార్లమెంట్‌లో లైంగిక నేరాలకు పాల్పడే 16 సంవత్సరాల మైనర్ బాలురలపై కూడా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసేలా బిల్లు పాస్‌చేసిన విషయం తెలిసిందే.