రంగారెడ్డి

ఆర్యవైశ్యులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, అక్టోబర్ 16: సామాజిక సేవా కార్యక్రమాలకు నిర్వచడం ఆర్యవైశ్య కులస్థులని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి చెప్పారు. ఇంటర్నేషన్ వైశ్య ఫెడరేషన్(ఐవిఎఫ్) తెలుగు రాష్ట్రాల అధ్యక్షడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో 264 జంటలకు సాముహిక షష్టి పూర్తి మహోత్సవాన్ని ఆదివారం నాగోలులోని శుభం కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వమించారు. కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపి సిహెచ్ మల్లారెడ్డి. రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, ప్రకాష్ గౌడ్, రాజ్‌నాథ్‌సింగ్, ఐవిఎఫ్ జాతీయ అధ్యక్షడు గంజి రాజవౌళి గుప్తా, నగర మేయర్ బొంతు రాంమోహన్, వర్తమాన సినీ నటి అశ్విని హాజరయ్యారు. రోశయ్య మాట్లాడుతూ దంపతులకు షష్టి పూర్తి కార్యక్రమం శాస్ర్తియమని పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. వివాహాలు చేసుకోవడం కష్టమనే ఈ రోజుల్లో వైశ్య సంఘాలు సామూహిక వివాహాలు, షష్టి పూర్తి కార్యక్రమాల లాంటి వేడుకలను చేయడం అభినందనీయని అన్నారు. మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ వైశ్యులకు టిఆర్‌ఎస్ అండగా ఉంటుందని, వారిని అన్నివిధాల గౌరవిస్తామని అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు వైశ్యుల పట్ల చక్కటి అభిప్రాయం ఉందని, వారి వ్యాపారాలు, ఎదుగుదలకు కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్ మమతా గుప్తా, అయిత రాములు, చకిలం రమణయ్య గుప్తా, మేఘమాల, ఉప్పల స్వప్న పాల్గొన్నారు.