రంగారెడ్డి

ప్లాస్టిక్ నిషేధానికి పకడ్బందీగా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, అక్టోబర్ 17: తాండూరు మున్సిపాలిటీ పరిధిలో నాణ్యతా ప్రమాణాలు లేని ప్లాస్టిక్ నిషేదానికి కఠిన చర్యలు చేపట్టాడానికి ఇక ముందు నిర్ణయించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి పట్టణంలోని అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు, వాణిజ్య సంస్థల వారిని పిలిచి పట్టణంలో ఇక ముందు నాణ్యతా ప్రమాణాలు లేని ప్లాస్టిక్‌ను నిషేధించడంలో కఠినంగా వ్యవహారించనున్నట్లు చైర్‌పర్సన్ విజయలక్ష్మీ వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అంశంలో దాన్ని వాడే తమలాంటి వ్యాపారులను హెచ్చరించే బదులు నాణ్యతా ప్రమాణాలు పాటించని ప్లాస్టిక్ తయారీ సంస్థలు, పరిశ్రమలను ముందుగా నిషేధించడం ద్వార ప్రయోజనం ఉంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఎస్.సంతోష్ కుమార్ వ్యాపార వర్గాలను ఉద్ధేశించి మాట్లాడుతూ తాండూరు పట్టణ పరిసరాలలో ప్లాస్టిక్ బ్యాగులు, నాణ్యతా ప్రమాణాలు లేని ప్లాస్టిక్ సామాగ్రీ తయారుచేసే పరిశ్రమలు ఉంటే మీరు పేర్కొన్న విధంగానే తయారీ కేంద్రాలను మూసి వేయించే వారమని అన్నారు. కాగా 40 శాతం మైక్రాన్లు కన్నా తక్కువ పరిణామంలో తయారయిన ప్లాస్టిక్ బ్యాగులు, క్యారీ బ్యాగులను మార్కెట్‌లలో వాడకుండా నిషేధించడం తప్పనిసరని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు, క్యారీ బ్యాగులు నిషేధిస్తామంటూ ఆర్డర్లు పాస్ చేస్తే ఎలా అంటూ పలువురు ప్లాస్టిక్ వియోగంపై అధిక భాగం ఆధార పడిన వ్యాపారులు ప్రశ్నించారు. అందుకు గతంలో సైతం పలు దఫాలు ప్లాస్టిక్ బ్యాగులు, నాణ్యత ప్రమాణాలు లేని ప్లాస్టిక్ పరికరాలు వస్తూ పామాగ్రీలను నిషేదించటం, పట్టణ వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, హోటళ్ల యాజమానులు, బేకరీలు, స్వీట్ బండార్ కేంద్రాల నిర్వాహకులతో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాణ్యత విలువలు లేని ప్లాస్టిక్ బ్యాగులు, 40శాతం మైక్రాన్లు మించని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడటం మానలేదంటూ మున్సిపల్ చైర్‌ఫర్సన్ విజయలక్ష్మీ, మున్సిపల్ కమీషనర్ సంతోష్ కుమార్‌లు కఠినంగా ఎత్తిచూపారు. అందుకు స్థానిక వ్యాపారులు, అన్ని సంస్థలకు చెందిన వారు ప్రస్తుతం మార్కెట్‌లో వాడుకలో తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బ్యాగులు, క్యారీ బ్యాగులు అయిపోయేంత వరకు తమకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికార, పాలక వర్గం సభ్యులు వ్యాపార వాణిజ్య వర్గాలవారికి వారం రోజులు గడువు విధించారు, అనంతరం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్లాస్టిక్ వినియోగం చేసే వ్యాపారులతోపాటు, వినియోగించే ప్రజలపై చర్చలు చేపడుతూ, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.