రంగారెడ్డి

అడవులని పది శాతానికి పెంచాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 17: మేడ్చల్ జిల్లాలో జానాభాకు తగట్టుగా ఆడవుల శాతాన్ని పది శాతం వరకు పేంచేందుకు అధికారులు నడుంబిగించాలని జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ మండలంలోని కండ్లకోయ గ్రామ పరధిలో గల ఆటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అన్ని జిల్లాల కంటే మేడ్చల్ జిల్లాలో ఆటవీ ప్రాంతం అతి తక్కువగా ఉందని జనసాంద్రతలో మొదటి స్థానంలో ఉన్న మేడ్చల్ జిల్లా ఆటవీ ప్రాంతంలో మాత్రం ఏడవ స్థానలోంలో అది కూడా కేవలం ఏడు శాతం మాత్రమే ఆటవీ ప్రాంతం కల్గి ఉండటం ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి ముందంజలో ఉండగా నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో మాత్రం అధికారులు కేవలం నామమాత్రంగా కార్యక్రమాన్ని చేపట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కేవలం ఆటవీ ప్రాంతంలో మాత్రమే మొక్కలు నాటి చేతులు దులుముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పారిశ్రామికవాడల్లో, విద్యా సంస్థల్లో ఖాళీ ప్రదేశాల్లో అదికారులతో పాటు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందకు విధిగా కృషి చేయాలని కోరారు. వచ్చే ఏడాదికల్లా మేడ్చల్ జిల్లాలో జనాభాకనుగుణంగా పది శాతం ఆటవీ ప్రాంతాన్ని పెంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. అందుకు అధికారులు కసరత్తు చేయాలన్నారు. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆటవీ శాతాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. పచ్చదనం పరిఢవిల్లితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు కాలుష్యాన్ని నివారించవచ్చని వివరించారు. అందుకోసం గురుతరమైన సామాజిక బాధ్యతగా అందరం భావించి సమిష్టిగా ముందుకు సాగి లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. జిల్లాలోని ఆటవీ ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలతో పాటు పండ్ల మొక్కలను కూడా నాటే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఉత్తమ ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఎంతో పవిత్రమైన పుణ్యకార్యంగా భావించి పౌరులందరూ పాల్గొని దీనిని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆటవీ ప్రాంతాన్ని సందర్శించిన చెట్లపై పలు విషయాలని ఆటవీ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. పండ్ల చెట్ల ద్వారా లభించే పండ్లను అమ్ముతున్నారా అని అధికారులను అడిగారు. నీరు ఏలా నిల్వ చేస్తున్నారో తెలుసుకున్నారు. కలెక్టర్ సుమారు గంట సేపు ఆటవీ ప్రాంతంలో అధికారులతో గడిపారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్‌ఎం నాయక్, ఎఎస్‌ఓ శామీర్‌పేట్ ఎల్‌ఎస్ విజయశ్రీనివాస్, లక్ష్మాపూర్ ఫారెస్ట్ అధికారి ఫరీద్, గుండ్లపోచంపల్లి అధికారి జగదీశ్‌చంద్ర, కీసర అధికారి ఇంతియాజ్‌అలీ, ఫారెస్టు బీట్ అధికారి విద్యాసాగర్, విశ్రాంత ఉద్యోగి యాదగిరి హెచ్‌ఎండిఎ రేంజ్ అధికారి చంద్రయ్య పాల్గొన్నారు.