రంగారెడ్డి

విజ్ఞాన మేళాలో ఆకర్షించిన సౌరశక్తి సైకిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఆక్టోబర్ 21: గండిపేట మండలం బండ్లుగూడ జాగీర్ శ్రీశారదాధామంలో విద్య భారతి దక్షిణ మధ్య క్షేత్ర విజ్ఞాన మేళ ప్రారంభమైంది. భవిష్యత్ శాస్తవ్రేత్తలు ఊహించిన విధంగా నూతన ఆవిష్కరణలు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. భారతీయ విజ్ఞాన విహార కేంద్రం విజయవాడకు చెందిన విద్యార్థి కాలుష్యం లేని సౌర ఇంధనంతో తయారు చేసిన సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విజయవాడకు చెందిన విద్యార్థి విశ్వాస్‌చే తయారు చేయబడిన సైకిల్‌ను ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు కూడా సందర్శించడం విశేషం. నేడు కాలుష్యం కోరల్లో మనం అందరు ఇబ్బంది పడుతున్న తరణంలో కాలుష్యం లేకుండా సైకిల్ మీద ప్రమాణం చేయవచ్చని విశ్వాస్ తెలిపారు. గతంలో కూడా అనేక ప్రయోగాలు చేసి అందరి దృష్టిని ఆకర్శించినట్లు తెలిపారు. బాలబాలికలలో అద్భుతమైన మేధాశక్తి దాగికొని ఉందని, దానికి వెలికి తీయవలసిన అవసరం నేటి ఉపాధ్యాయులపై ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ అన్నారు. విశ్వాస్ లాంటి బాల శాస్తవ్రేత్తలను అందరు కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్‌రావుతో పాటు అందరు అభినందించారు.