రంగారెడ్డి

కూరగాయల దళారులపై రైతుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, అక్టోబర్ 21: పరిగి కూరగాయల మార్కెట్‌లోని దళారులు, పక్క జిల్లాకు సంబంధించిన దళారులు కుమ్మకై స్థానిక కూరగాయల రైతులకు అన్యాయం చేస్తుండటం గమనించిన కూరగాయ రైతులు ఒక్కసారిగా తిరగబడి పక్కజిల్లాకు చెందిన దళారులను చితకబాదారు.
కూరగాయలను నేలపై పారబోశారు పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పక్కజిల్లాల దళారులు తమ వాహనాన్ని మళ్లించి పారిపోయారు. ఈ సంఘటన పరిగి కూరగాయల మార్కెట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.పరిగి కూరగాయల మార్కెట్‌కు గత కొంతకాలంగా మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్, మహబూబ్ నగర్, కర్నూల్ నుంచి కూరగాయలను దళారులు తీసుకువస్తున్నారు.
పరిగి కూరగాయల మార్కెట్‌లో ఉండే స్థానిక దళారులు పక్కజిల్లాల నుంచి కూరగాయలను తీసుకువస్తున్న దళారులతో కుమ్మక్కయ్యారు. వీరు స్థానిక రైతుల నుంచి తక్కువ మొత్తానికి కూరగాయలను కొనుగోలు చేసి, మార్కెట్‌లో మాత్రం ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దళారుల వద్ద తమకు గిట్టుబాటు ధర సైతం రావడం లేదని, తమ దగ్గర కొన్న కూరగాయలను రెట్టింపు ధరకు అమ్ముకుంటున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. దీంతో స్థానిక కూరగాయ రైతులు కొంతకాలంగా నష్టపోతున్నారు. పలుమార్లు పరిగి మార్కెట్ కార్యదర్శికి సమాచారాన్ని స్థానిక కూరగాయ రైతులు ఇచ్చారు. అయినా కార్యధర్శి పట్టించుకోలేదు. దళారులు, అధికారులు ఏకమయ్యారని భావించిన రైతులు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కూరగాయలను తీసుకువచ్చిన దళారుల డిసిఏం వాహనాన్ని అడ్డుకున్నారు. డిసిఎంలో కూర్చున్న దళారులను బయటికి లాగి చితకబాదారు. డిసిఎంలో వారు తీసుకువచ్చిన కూరగాయలను స్థానిక రైతులు పారబోశారు. స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పక్క జిల్లాలకు సంబంధించిన దళారులకు ఇక్కడ ఎవరూ సహకరించకపోవడంతో కాసేపు రైతులతో దెబ్బలుతిన్న వారు కూర గాయలు తీసుకువచ్చిన డిసిఎం ఎక్కి వచ్చిన దారిన వెళ్లిపోయారు.