రంగారెడ్డి

బస్తీకి సుస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 21: వాతావరణంలో మార్పులు, అపరిశుభ్రత, విజృంభిస్తున్న దోమలతో జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ డివిజన్‌లోని ‘గాంధీ’ గిరిజనబస్తీ డెంగీ ఫీవర్‌తో వణుకుతోంది. డెంగీతో ఇటీవల ఓ బాలుడు మరణించగా మరి కొందరు వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మందికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మరి కొందరు విష జ్వరాలతో చికిత్స పొందుతున్నారు.
ఒకే బస్తీలో ఎంతో మంది చిన్నారులు విష జ్వరాలతో అస్వస్థతకు గురవ్వడంతో బస్తీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు జిహెచ్‌ఎంసి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం పేరుతో ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రధాన రహదార్లతో పాటు బస్తీ రహదార్లలో చెత్త చెదారాన్ని తొలగిస్తూ పరిశుభ్రత వైపు వడి వడిగా అడుగులు వేస్తుంటే మరొక వైపు డెంగీ అనుమానం లక్షణాలతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంతో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పులా లేక దోమ కాటా విష జ్వరాలు రావడానికి గల కారణాలేమిటో అంతుచిక్కకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే బస్తీలో నివసిస్తూ మూడో తరగతి చదువుతున్న ఇమ్రాన్‌అనే ఎనిమిదేళ్ల బాలుడు డెంగీతో మరణించాడు. ప్రస్తుతం పరిసర ప్రాంతాలలోని ఎడిఆర్‌ఎం, జయకృష్ణ ఇతర ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారులు సైతం విషజ్వరంతో వణుకుతుండగా వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే ఆదేశాలు
గాంధీ గిరిజన బస్తీలో 26 మంది చిన్నారులు విష జ్వరాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవ్వడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్ బస్తీని సందర్శించారు. ఇంటింటికి వెళ్లి ఎంత మంది చిన్నారులు జ్వరంతో ఆసుపత్రి పాలయ్యారని వారి కుటుంబ సభ్యులతో వివరాలను తెలుసుకుని ఆసుపత్రులకు వెళ్లి చిన్నారులను పరామర్శించారు. డెంగీతో బాలుడు మరణించగా అనేక మంది విద్యార్థులు విష జ్వరాలతో వణుకుతుండగా అధికారులు ఏం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డా. పల్లవి నేతృత్వంలో ప్రత్యేక సిబ్బంది బస్తీలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జిహెచ్‌ఎంసి ఉప్పల్ డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ నేతృత్వంలో ఏఎంహెచ్‌ఓ స్వామి, ఎంటమాలజీ, మలేరిలయా విభాగం అధికారులు, సిబ్బంది బస్తీలో పర్యటించారు. దోమల నివారణపై యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. పరిశుభ్రతపై ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించారు.
కార్పొరేటర్ పర్యటన
గాంధీ గిరిజనబస్తీని స్థానిక కార్పోరేటర్ బేతి స్వప్న అధికార పార్టీ నాయకులకులతో శుక్రవారం సందర్శించారు. విష జ్వరాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. బస్తీలో పారిశుద్ధ్యం, దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.