రంగారెడ్డి

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్బిబౌలి, ఏప్రిల్ 30: ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. కమిషనరేట్‌లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. జెఎన్‌టియు అధికారులను సంప్రదించిన తర్వాత వారి సూచనల మేరకు కమిషనరేట్‌లో ఆరు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షం నీటిని పరిరక్షించుకొని భావితరాలకు మంచినీటిని అందించాలని చెప్పారు. అన్ని పోలీస్‌స్టేషన్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని ఆదేశించామని గుర్తుచేశారు. స్వచ్చంద సంస్థలు చేయూనివ్వాలని కోరారు. కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి కార్తికేయ పాల్గొన్నారు.
జల సంరక్షణ అందరి బాధ్యత
అల్వాల్: జల సంరక్షణ ప్రజలందరి బాధ్యతని, పొదుపు చేసి కాపాడుకోవాలని ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి చెప్పారు. శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో నిర్మించనున్న ఇంకుడు గుంత నిర్మాణ పనులను ఏసిపి సయ్యద్ రఫిక్, సిఐ ఆనంద్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి రెడ్డి, ఎస్‌ఐలు మధుసూదన్ రెడ్డి, రాజేష్ కుమార్, ఎన్.రమేష్, బి.రాంబాబు, రఘురాం, జలమండలి డిజిఎం రజని, మేనేజర్ వెంకటేశ్వరావు, మల్కాజిగిరి తహశీల్దార్ విజయ, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ అడప రమేష్, నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, లావణ్య పాల్గొన్నారు.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్: ప్రతి నీటిబొట్టును కాపాడుకున్నప్పుడే భవిష్యత్తు తరాలకు నీటిని అందించినవారమవుతామని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ ఆవరణలో ఇంకుడు గుంతలను జెసిబిలతో తవ్వి నిర్మించారు.
కీసరలో..
కీసర: ఇంకుడు గుంతలతో నీటి సమస్యలు దూరమవుతాయని సిఐ గురువారెడ్డి అన్నారు. శనివారం కీసర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసారు. ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంతలో చేరేలా చూసుకోవాలని అన్నారు. భూగర్భ జలాలను పెంచుకునేందుకు ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు అనంతాచారి, రవీందర్, పాల్గొన్నారు.
భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతల ఆవశ్యకతనుప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు నీరు అందించాలంటే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఇంకే విధంగా చేస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుంటుందని అన్నారు.