రంగారెడ్డి

ద్విచక్రవాహనాల దొంగపై పీడీ యాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 28 : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పీడీ యాక్టు కింద మొదటి కేసు నమోదైంది. సైబరాబాద్ రెండు కమిషనరేట్లుగా విభజించడంతో కమిషనర్లకు పీడీ యాక్టు విధించే వెసులుబాటు లేక ఇంతవరకు నిందితులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయలేదు. కమిషనరేట్‌కు ప్రభుత్వ ఆమోదం లభించడంతో పాటు ఆర్డినెన్స్ రావడంతో కమిషనర్ సంఘ విద్రోహులపై చర్యలు ప్రారంభించారు. ప్రజల ధన, ప్రాణాలకు ఇబ్బంది కలిగించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించే కరుడుగట్టిన నేరస్తుడిపై పీడీ యాక్టు విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. రాచకొండ కమిషనరేట్ హయత్‌నగర్ లోని భాగ్యలత కాలసీలో నివాసుముంటున్న గురిజాల సురేష్ (21) పాలు సరఫరా చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన సురేష్ పాలు సరఫరా చేస్తూ పార్కుచేసిన ద్విచక్రవాహనాలను దొంగిలించేవాడు.
కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట, ఎల్‌బి నగర్, హయత్‌నగర్, చైతన్యపురి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో 18 ద్విచక్రవాహనాలను దొంగిలించడంతో పాటు సంతోష్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ దొంగిలించిన కేసులలో నిందితుడు. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినా బయటకు వచ్చి యధావిధిగా దొంగతనాలు చేయడంతో పీడీ యాక్టు కేసు పెటినట్టు కమిషనర్ మహేష్ ఎం భగత్ తెలిపారు. నిందితులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిందితులు మారితే వారికి పునరావాసం కల్పించేందుకు