రంగారెడ్డి

మేడ్చల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 28: మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై శుక్రవారం భారీగా ట్రాఫిక్ కనిపించింది. మునుపెన్నడూ లేని విధంగా వందలాది వాహనాలు బారులు తీరి రాకపోకలు సాగిస్తూ కనిపించాయి. దీపావళి పండుగకు తోడు వరుస సెలవులు రావడంతో సొంత ఊళ్లకు వెళ్లే వారు కార్లలలో ద్విచక్రవాహనలలో బయల్దేరడంతో రోడ్డుపై విపరీదతమైన రద్దీ కనిపించింది. మేడ్చల్ చెక్‌పోస్టు నుండి డిపో అవతలి వైపు వరకు వాహనాలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయాయి. స్థానిక పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఎంత ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధరించలేక సతమతమయ్యారు. చివరకు చేసేదిలేక అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు. దీంతో వాహనాదారులు పడ్డ ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొనుగోలుదారులు కూడా మార్కెట్‌కు భారీగా తరలిరావడంతో కూడా ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు బస్ స్టేషన్ సమీపంలో ఓ భారీ వాహనం సాంకేతికలోపం తలెత్తి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించడానికి కారణమని చెప్పవచ్చు. వాహనాదారులు నత్తలా మెల్లమెల్లగా ముందుకు సాగుతూ తమ కష్టాలు తాము పడుతూ ఎలాగోలా ట్రాఫిక్ గండం నుండి గట్టెక్కారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి వరకు ట్రాఫిక్ సమస్య అలాగే కనిపించింది. కాగా ఆయా నిబంధనలను అసరా చేసుకుని వేలాది రూపాయలను చలాన్ల పేరుతో వాహనదారుల నుండి దండుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ భారీగా స్తంభించినప్పుడు దానిని క్రమబద్ధీకరించాల్సింది పోయి మెల్లగా అక్కడి నుండి జారుకోవడం పట్ల వాహనదారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.