రంగారెడ్డి

ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట, ఆక్టోబర్ 28: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై కలెక్టర్ దివ్య ళుక్రవారం మోమిన్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికారాబాద్, దోమ, కుల్కచర్ల మండలాల ఎంపిడిఓలతో హరితహారం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ప్రజల ఫిర్యాదులను, సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆవసరమైతే సబ్ కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తేవాలని ఉపతహసీల్దార్ దనుంజుయను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును 15 రోజుల్లోగా పరిష్కరించాలని సూచించారు. కార్యాలయ ఆవరణలో శిథిల భవనాలను కూల్చివేయాలని ఆదేశించారు. సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ టిసిపిఎస్‌ఇఎ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు పటేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచాలని వినతి పత్రం సమర్పించారు.