రంగారెడ్డి

బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 6: బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెరాస ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. బాచుపల్లి గ్రామంలో బ్రాహ్మణుల సేవా సమితి కార్తీక మాస సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కవిత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆమెను బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. కవిత మాట్లాడుతూ బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలను భరిస్తుందని చెప్పారు. బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.వంద కోట్ల నిధులను కేటాయించడంతో పాటు పనె్నండెకరాల స్థలాన్ని కేటాయించిందని అన్నారు. బ్రాహ్మణులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న బ్రాహ్మణులంతా తెలంగాణ వాదులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే కెపి వివేక్, ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవిఆర్ కృష్ణారావు, మల్లాది శాస్ర్తీ, ఎంవి శాస్ర్తీ, గీతామూర్తి, డి.రవి పాల్గొన్నారు.