రంగారెడ్డి

చెరువుల పునరుద్ధరణకు అత్యధిక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మే 3: చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించిందని మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా భోగారం గ్రామంలోని భోజరాజు చెరువులో రెండవ విడత మిషన్ కాకతీయ పనులను మంగళవారం ప్రారంభించారు. మిషన్ భగీరథ క్రింద మేడ్చల్, శామీర్‌పేట్, మండలాలకు తాగునీరు అందిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని 75 చెరువుల పునరుద్ధరణకు రూ.5కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. పూడికతీత పనులు పూర్తికాగానే సకాలంలో వర్షాలు పడి చెరువులు కళకళలాడుతాయని అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియొగం చేసుకోవాలని సూచించారు. భోగారం గ్రామంలో రైతులకు సబ్సిడీపై అందిస్తున్న పశు దాణాను రైతులకు అందజేసారు. కరవు నివారణ చర్యల్లో భాగంగా భూమిలేని నిరుపేద రైతులకు యాభై శాతం సబ్సిడీపై దాణాను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. డివిజన్ స్థాయిలో సహాయ సంచాలకులు, మండల పశువైధ్యాధికారి ఆధ్వర్యంలో రైతులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సర్పంచ్ మానసను కోరారు. జడ్‌పిటిసి బి.రమాదేవి, ఎంపిపి సుజాత, తహశీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపిడిఓ వినయ్‌కుమార్, సర్పంచ్‌లు మానస, అనిల్, టిఆర్‌ఎస్ నాయకులు ఎం.రవికాంత్, జంగయ్య, వెంకట్‌రాంరెడ్డి, బస్వారెడ్డి, కె.మల్లేశ్, పెంటయ్య పాల్గొన్నారు.