రంగారెడ్డి

ఎటు చూసిన నోటు కష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 15: నల్లధనాన్ని వెలికితీస్తూ, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన ఐదు రోజులుగా వెయ్యి, ఐదు వందల నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల మార్పిడీ కోసం ఆయా ప్రాంతాలలోని బ్యాంకుల వద్ద బారులు తీరినా నోటు కష్టాలు తప్పడంలేదు. చిల్లర డబ్బుల కోసం ఉదయాన్ని పనులు మానుకుని బ్యాంకుల వద్ద మరీ క్యూలో నిల్చొని మార్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఒకవైపు చిల్లర డబ్బులు, మరొకవైపు చేతిలో ఉన్న రూ.వెయ్యి, ఐదు వందల నోట్లను డిపాజిట్ చేయడానికి బ్యాంకుల వద్దకు వెళ్తే క్యూలో ఉన్న ప్రజల్ని చూసి భయపడి వెనుకకు తిరిగి ఇంటికి రావాల్సివస్తోందని పలువురు వాపోతున్నారు. ప్రస్తుత అవసరాల కోసం మార్పిడీ చేసుకుంటే వచ్చే నాలుగువేలు సరిపడక అవస్థలు పడుతున్నారు. వెయ్యి, ఐదు వందల నోట్ల మార్పిడీకి ఈనెల 24వ తేదీ వరకు గడువు విధించడంతో ప్రజలు హడావుడిగా బ్యాంకులు, ఏటిఎంల వద్ద గంటల కొద్దీ మరీ క్యూలో నిల్చోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే ఆయా బ్యాంకులలో ఉన్న అకౌంట్లలో జమ చేసుకుంటున్నప్పటికీ వెంటనే ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరం, శివారు ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో ఎక్కడ చూసినా క్యూలో నిల్చొన్న జనం కన్పించడం గమనార్హం. మంగళవారం సికింద్రాబాద్ మారేడిపల్లిలోని బ్యాంకు వద్ద డబ్బులను అకౌంట్‌లో వేసుకోవడానికి వెళ్లి క్యూలో నిల్చొని కాళ్లుచేతులు వణుకుతూ సొమ్మసిల్లి పడిపోయిన కొద్ది సేపట్లోనే మరణించాడు. ఈ సంఘటనతో చిల్లర కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిల్చోవాలంటే ప్రాణం మీదికి వస్తుందేమోనని వృద్ధులు భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో బందువులు, స్నేహితులకు గిఫ్ట్ ఇవ్వడానికి చేతిలో డబ్బులు లేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కనీసం ఖర్చుల కోసం చిల్లర డబ్బులు లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, బట్టలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి చిల్లర సమస్యతో వ్యాపారం నడవక వ్యాపారులు నెత్తికి చేతులు పెట్టుకుని బతుకుదెరువు ఎలా అని వాపోతున్నారు. డబ్బులు ఉన్నవారైతే దర్జాగా పనుల్లో బిజీగా ఉండిపోగా పేద, మధ్య తరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు పరిస్థితి మారకపోతే మరిన్ని కష్టాలు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ఏర్పాట్లు చేయాల్సింది
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం ఉన్న పళంగా పెద్ద నోట్లను రద్దు చేసే ముందు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తే బావుండేదని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే స్వయంగా పట్టణంలోని ఎస్‌బిహెచ్ బ్యాంక్ వద్దకు విచ్చేసి పరిస్థితిని ప్రజల ఇక్కట్లను తెలుసుకున్నారు. తాను కూడా సామాన్యుని వలే క్యూలైన్‌లో నిల్చుని ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతిని బ్యాంకు అధికారులు అందజేసి తన వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దీ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపడితే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావన్నారు. పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏటిఎంలతో పాటు బ్యాంకులకు ముందుగా వంద వంటి నోట్లను పంపిణీ చేసిన తర్వాత పెద్ద నోట్లను రద్దు చేసివుంటే బావుండేదని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల ఎక్కువగా పేద మధ్యతరగతి వారే ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. కాగా మంగళవారం పట్టణంలోని ఆయా బ్యాంకుల వద్ద ఏడవ రోజు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్‌లు చేసుకునేందుకు జనాలు పెద్ద సంఖ్యలో బారులుతీరారు.