రంగారెడ్డి

మీ-సేవ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 18: వివిధ ప్రభుత్వ పరమైన సేవలను పొందేందుకు పలు ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ప్రజలు వినియోగించే శామీర్‌పేట్ మీ-సేవా కేంద్రాన్ని అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. శ్రీ్భవనేశ్వరీ కమ్యూనికేషన్ పేరుతో శామీర్‌పేట్‌లో మీ-సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆర్.చంద్రశేఖర్.. వినియోగదారుల నుంచి నిబంధలను తుంగలో తొక్కుతూ అధికంగా డబ్బులు తీసుకుంటున్నాడని, అంతేకాకుండా సమయపాలన పాటించడంలేదని ఫిర్యాదులు అందుకున్న అధికారులు శుక్రవారం మీ-సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పలువురు వినియోగదారుల వద్ద నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇష్టానుసారంగా ప్రజల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని అధికారులకు వివరించారు. మీ-సేవా నిర్వాహకుడి నిర్వాకంతో సామాన్య ప్రజానీకంతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని అధికారులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. దీంతో మీ-సేవా కేంద్రాన్ని సీజ్ చేసి అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు తగు చర్యలకు నివేదించారు.