రంగారెడ్డి

రాక్‌వెల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 20: మేడ్చల్ పారిశ్రామికవాడలోని రాక్‌వెల్ అనే ఫ్రిజ్‌లు తయారు చేసే పరిశ్రమలో ఆదివారం గుర్తుతెలియని కారణంతో అగ్నిప్రమాదం సంభవించింది. కాగా నిర్వాహకులు కంపెనీ ప్రతినిధులు స్థానిక పోలీసులకు గాని అగ్నిమాపకశాఖ వారికి సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్కసారిగా మంటలు చేలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. పెద్దమొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లినా సదరు యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా వారే ఆటోల ద్వారా నీటి ట్యాంకర్‌లను తెప్పించి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరుగలేదు.
కిరాణా జనరల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం
కుషాయిగూడ, నవంబర్ 20: ప్రమాదవశాత్తు కిరాణా జనరల్ స్టోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కాప్రా మున్సిపాల్టీ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీ కిరాణా జనరల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం జరిగిన్నట్టు తెలిపారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కిరాణా స్టోర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి వివరాల తెలియజేస్తామని తెలిపారు.
బాలుడు అదృశ్యం
జీడిమెట్ల, నవంబర్ 20: బయటికి వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట, హనుమాన్‌నగర్‌లో నివాసముండే మంజుదేవి, గణేశ్‌కుమార్ దంపతుల కుమారుడు దీపక్ కుమార్ (12) ఈనెల 19న మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో దీపక్ కుమార్ గురించి ఆరా తీయగా ఆచూకీ దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.