రంగారెడ్డి

ఫోర్జరీ కేసులో విఆర్వో, సబ్ రిజిస్ట్రార్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 1: ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరుల భూముని అమ్ముకున్న ఏడుగురు వ్యక్తులు, వారికి సహకరించిన విఆర్‌ఓ, సబ్ రిజిస్ట్రార్‌లపై కేసు నమోదు చేసినట్టు ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం చౌదరిగూడ పంచాయతీ ముత్వెల్లిగూడ గ్రామంలోని సర్వేనెంబర్ 1లోని ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన విజయారెడ్డి 2012లో ముత్వేల్లిగూడ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి వద్ద కొనుగోలు చేశాడు.
2014లో ఎకరం 18 గుంటల భూమిని సత్తిరెడ్డికి విక్రయించినట్లు చెప్పారు. అంతా ప్రశాంతంగా ఉండటంతో విజయారెడ్డి రెండు సంవత్సరాలుగా రాలేదు. ఇదే అదునుగా భావించిన ముత్వేల్లిగూడ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన శెట్టిపల్లి బాలయ్య, మురళీధర్, రాములు, మల్లేష్, నారాయణ, శ్రీనివాస్, శ్రీహరి గతంలో ఇక్కడ పని చేసిన విఆర్వో రణవీర్‌రెడ్డి సహాయంతో పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించి ఘట్‌కేసర్ సబ్ రిజిస్ట్రార్ సురేష్ సహాయంతో యు.వాణికి విక్రయించారు.
ఇటీవల విజయారెడ్డి తన భూమి వద్దకు పరిశీలించగా ఇతరులకు అమ్మినట్టు తెలిసింది. దీంతో అవాక్కయిన విజయారెడ్డి ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పైన పేర్కొన్న నిందితులతోపాటు నిందితులకు సహకరించిన విఆర్‌వో సబ్‌రిజిస్ట్రార్‌లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.