రంగారెడ్డి

పాతనోట్ల మార్పిడి పేరుతో మోసగించిన ఇద్దరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 2: పాతనోట్లను తీసుకొని కమీషన్‌పై కొత్తనోట్లు ఇస్తామని మోసగించి రూ.7 లక్షలను ఎత్తుకెళ్లిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ప్రవీణ్ తన వద్ద ఉన్న రూ.7 లక్షల పాతనోట్లను కమీషన్‌పై మార్చుకోవడానికి ఉప్పర్‌పల్లి చింతల్‌మెట్ ప్రాంతానికి చెందిన సర్వర్, సలీంలను మధ్యవర్తి సహాయంతో ఆశ్రయించాడు. 25 శాతం కమీషన్ తీసుకొని రూ.7 లక్షల పాతనోట్ల తీసుకొని కొత్తనోట్లను ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఒప్పందం మేరకు ప్రవీణ్ రూ.7 లక్షలు తీసుకొని ఉప్పర్‌పల్లికి వచ్చారు. సర్వర్, సలీంలు రూ.7 లక్షలను తీసుకొని కొత్త నోట్లు తీసుకొని వస్తామని తెలిపి అక్కడి నుంచి ఉడాయించారు. ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులను ప్రవీణ్ ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి సర్వర్, సలీంలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

ఫసల్ బీమా యోజన పథకంపై అవగాహన
మేడ్చల్, డిసెంబర్ 2: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారి కెఎన్ జగదీష్ సూచించారు. శుక్రవారం ఆయన డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులతో మేడ్చల్ వ్యవసాయశాఖ కార్యాలయంలో ‘యాసంగి వ్యవసాయం’పై సమావేశం నిర్వహించారు. విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 3వ విడత రుణమాఫీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఎలాంటి విషమైన సహకారమందించాలని సూచించారు. భూసార పరీక్షలకనుగుణంగా పంటలను సాగు చేసే విధంగా చైతన్యం కల్పించాలని కోరారు. వ్యవసాయాధికారులు రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ వారికి తగిన సలహలు సూచనలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎడిఎ శోభారాణి, మేరిరేఖా, వ్యవసాయాధికారులు శైలజ, విజయలక్ష్మీ, కవిత, శ్రీవాణి, గజలక్ష్మీ, రవి, మాధవరెడ్డి పాల్గొన్నారు