హైదరాబాద్

తక్కువ సమయంలోనే రాష్ట్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 2: తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కేసిఆర్ అభివృద్ధి చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 25వ వార్డులో టిఆర్‌ఎస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ను పురస్కరించుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణ కోసం కేసిఆర్ ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడారని గుర్తుచేశారు. దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్ళలోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు చేపట్టి రాష్ట్ర ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు. ఆనాడు దివంగత సిఎం చెన్నారెడ్డి చేపట్టిన తెలంగాణ ఉద్యమాన్ని, మలివిడత ఉద్యమంగా కేసిఆర్ చేపట్టారని వివరించారు. తెలంగాణ సాధించేందుకు చేపట్టిన ఉద్యమకారులపై వికారాబాద్‌లోనూ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అవకాశం వచ్చినా వికారాబాద్‌కు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి శుభప్రద్‌పటేల్, టిఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, వార్డు కౌన్సిలర్ జి.విజయేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు.